Begin typing your search above and press return to search.

ముగ్గురిని మార్చాడు.. నాలుగో హీరోని నెక్ట్స్‌ లెవ‌ల్‌కి చేర్చ‌గ‌ల‌ స‌మ‌ర్థుడు!

సందీప్ వంగా అంటే సూప‌ర్ ప‌వ‌ర్. ఒక ఎన‌ర్జీ. పాత్ర‌ల క్రియేష‌న్‌తో అగ్గి రాజేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. ప్ర‌తి పాత్ర‌ను నిప్పులాగా మ‌రిగే వాడిలా త‌యారు చేయ‌గ‌ల‌డు.

By:  Sivaji Kontham   |   16 Jun 2026 12:00 AM IST
ముగ్గురిని మార్చాడు.. నాలుగో హీరోని నెక్ట్స్‌ లెవ‌ల్‌కి చేర్చ‌గ‌ల‌ స‌మ‌ర్థుడు!
X

సందీప్ వంగా అంటే సూప‌ర్ ప‌వ‌ర్. ఒక ఎన‌ర్జీ. పాత్ర‌ల క్రియేష‌న్‌తో అగ్గి రాజేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. ప్ర‌తి పాత్ర‌ను నిప్పులాగా మ‌రిగే వాడిలా త‌యారు చేయ‌గ‌ల‌డు. అందుకే అత‌డి సినిమాల్లో ప్ర‌తి స‌న్నివేశం గ‌గుర్పాటుకు గురి చేస్తుంది. లేదా ఏదో ఒక ఎమోష‌న్ ని అణువ‌ణువునా భ‌గ‌భ‌గ‌ల్ని పుట్టిస్తుంది.

అత‌డిని క్రిటిక్స్ ఎంతగా విమ‌ర్శిస్తే అంత‌గా అత‌డిలో క‌సి పెరిగిపోతుంది. అత‌డు సృష్టించే పాత్ర‌ల తీరు తెన్నులు కూడా అంతే ప‌వ‌ర్ ఫుల్ గానో హింసాత్మ‌కంగానో మారుతున్నాయి. అర్జున్ రెడ్డి మొద‌లు క‌బీర్ సింగ్, యానిమ‌ల్ ర‌ణ్ విజ‌య్ పాత్ర‌ల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు ఒక పాత్ర‌ను మించి ఇంకో పాత్ర మార్మికంగా, క‌ర్మ సిద్ధాంత అనుసారంగా ప్ర‌వ‌ర్తించే తీరు అణువ‌ణువునా జ్వ‌లింప‌జేస్తాయి. పాత్ర ప్ర‌వ‌ర్త‌న‌తో ర‌క్తి క‌ట్టించ‌డం అనే అరుదైన టెక్నిక్ వంగాకే చెందుతుంది.

ఇంత‌కుముందు అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అత‌డు చూపించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక ఇంటెన్స్ క్యారెక్ట‌ర్ ని ర‌గ్ డ్ గా ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ అవ‌తార్ లో ఎలా చూపించాలో అప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికీ తెలీదేమో! అనేంత‌గా ఆ పాత్ర‌ను చూపించాడు. ఒక ర‌కంగా వ‌క్కంతం వంశీ 'నా పేరుసూర్య' లో ఆద‌ర్శ‌వంత‌మైన సూర్య పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరుకు పూర్తి ఆపోజిట్‌లో ఒక పోకిరి- హింసాత్మ‌క పాత్ర‌ను క్రియేట్ చేసి, ఆ పాత్ర‌కు కూడా కొన్ని నీతినియ‌మాల్ని జోడించి వంగా తెర‌పై అద్భుతాలు చేసాడు.

ఆ త‌ర్వాత అదే అర్జున్ రెడ్డిని హిందీలో క‌బీర్ సింగ్ గా మార్చాడు. షాహిద్ క‌పూర్ ఈ పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించ‌డానికి సందీప్ వంగా ఇచ్చిన ప్రేర‌ణ ఎంతో గొప్ప‌ది. షాహిద్ కెరీర్ లోనే అత్యుత్త‌మ‌మైన ప్ర‌ద‌ర్శ‌న కూడా ఇదే. ఆ త‌ర్వాత ఇక యానిమ‌ల్ చిత్రంలో ర‌ణ్ విజ‌య్ పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ ని మ‌లిచిన తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి. అప్ప‌టివ‌ర‌కూ ర‌ణ‌బీర్ వేరు.. ర‌ణ్ విజ‌య్ గా ర‌ణబీర్ వేరు. అత‌డి జాత‌క‌మే మారిపోయింది. హిందీ చిత్ర‌సీమ‌లో మొద‌టిసారి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ప్రారంభించింది ర‌ణ‌బీర్ అనేంత‌గా అత‌డిని తీర్చిదిద్దాడు. ర‌ణ‌బీర్ ఈరోజు ద‌క్షిణాదిన కూడా ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడంటూ సందీప్ వంగా కార‌ణం. యానిమ‌ల్ చిత్రం ఏకంగా 900 కోట్లు వ‌సూలు చేయ‌డం వెన‌క ర‌ణ్ విజ‌య్ పాత్ర ప్ర‌ధాన కార‌ణం.

అందుకే ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియాని ఏల్తున్న ప్ర‌భాస్ లాంటి స్టార్ తో సందీప్ వంగా సినిమా తీస్తున్నాడు! అన‌గానే రెండు ప‌వ‌ర్ హౌస్ ల క‌లయిక ఇంకెలాంటి సంచ‌ల‌నాలకు దారి తీస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టే సందీప్ వంగా త‌న కెరీర్ లోనే అత్యంత వ‌యొలెంట్ పాత్ర‌ను క్రియేట్ చేసాడ‌ని, ఇందులో ప్ర‌భాస్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ న‌భూతోన‌భ‌విష్య‌తి అనే రేంజులో ఉంటుంద‌ని లీకులు అందుతున్నాయి. ఇప్ప‌టికే అతడు యానిమ‌ల్ ర‌ణ్ విజ‌య్ ని అత్యంత క్రూరంగా చూపించాడు. నెగెటివ్ షేడ్ ఉన్న ఒక డాన్ గా ఆ పాత్ర‌ను చూపించాడు. అయితే అంత‌కుమించి క్రూరుడైన పోలీసాఫీస‌ర్ గా ప్ర‌భాస్ ని స్పిరిట్ లో చూపించ‌బోతున్నాడ‌నే వార్త నిజంగా అభిమానుల‌నే కాదు యావ‌త్ పాన్ ఇండియ‌న్ సినిమానే కుదిపేస్తోంది. ఈసారి డ‌బుల్ ధ‌మాకా పాన్ ఇండియా బొనాంజాను అత‌డు అందించ‌బోతున్నాడు.

ఒక స్ట్రిక్టు పోలీసాఫీస‌ర్ హింసాత్మ‌క దండ‌యాత్ర ఎలా ఉండ‌బోతోందో తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నాడు. అయితే `స్పిరిట్`లో ప్ర‌భాస్ పాత్ర ఎంత హింసాత్మ‌కంగా ఉన్నా దాని వెన‌క లాజిక్ ని సందీప్ వంగా ప‌ర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయడంలోనే అది మిరాకిల్స్ చేస్తుంద‌ని కూడా విశ్లేషించ‌వ‌చ్చు.

ప్ర‌భాస్ ఎంత‌టి ఫ్యామిలీ హీరో అయినా, యాక్ష‌న్ స్టార్ గా, ఆజానుభాహుడిగా ఒక పోలీసాఫీసర్ పాత్ర‌ను ర‌క్తి క‌ట్టించ‌బోతున్నాడు. ఇందులో అత‌డి యాక్ష‌న్ - హింసాత్మ‌క ప్ర‌వృత్తి హ‌ద్దులు దాటిన‌ట్టు అనిపించినా దాని వెన‌క లాజిక్కులు వెతికేవారికి క‌చ్ఛితంగా వంగా మార్క్ ఆన్స‌ర్ ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. యానిమ‌ల్ ర‌ణ్ విజ‌య్ ని హింసాత్మ‌కంగా చూపించినా, అత‌డు న‌చ్చ‌డం వ‌ల్ల‌నే జ‌నం థియేట‌ర్ల‌కు రిపీటెడ్ గా వెళ్లారు. ఇప్పుడు మ‌రోసారి స్పిరిట్ లో ప్ర‌భాస్ ని కూడా అదే రేంజులో ఆవిష్క‌రిస్తున్నాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ పాత్ర‌లో హింసాత్మ‌క ప్ర‌వృత్తి కంటే అత‌డి పాత్ర ఎలివేష‌న్ లో ఉద్వేగాలు ఎలా పండాయ‌న్న‌ది కీల‌కం కానుంది. దానిని అర్థం చేసుకునేందుకు స్పిరిట్ నుంచి టీజ‌ర్ వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.