అర్జున్ రెడ్డి మూవీ స్క్రీన్ ప్లే ఆ సూపర్ హిట్ మూవీ స్క్రీన్ ప్లే లానే ఉంటుంది... గమనించారా...
'శివ' సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన మూవీ 'అర్జున్ రెడ్డి'... ఈ మూవీ కథ లో వైవిధ్యాన్ని చూపిస్తూనే మేకింగ్ పరంగా కూడా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
By: Gopi Velupala | 5 Oct 2026 9:20 AM IST'శివ' సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన మూవీ 'అర్జున్ రెడ్డి'... ఈ మూవీ కథ లో వైవిధ్యాన్ని చూపిస్తూనే మేకింగ్ పరంగా కూడా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా కేవలం ఒక వ్యక్తి తను జీవించే జీవన విధానాన్ని అతనికి తెలియకుండా ఒక కెమెరా పెట్టి షూట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలానే ఉంటుంది... ఇక టెక్నికల్ గా కూడా ఈ మూవీ అప్పటివరకు ఉన్న మూస ధోరణికి స్వస్తి చెప్పి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఏది ఏమైనా కూడా అర్జున్ రెడ్డి సినిమా పేరు చెప్తే చాలు బాడీ లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో ఇలాంటి తరహాలోనే ఇంకా కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సందీప్ రెడీ వంగ సైతం భారీ ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాడు...
స్క్రీన్ ప్లే
అర్జున్ రెడ్డి మూవీ స్క్రీన్ ప్లే ను గమనించినట్లయితే అది నాన్ లీనియర్ గా నడుస్తుంది. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ తను లైఫ్ లో ఫెయిల్ అయ్యాడు అంటూ చెబుతూనే తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ని ఓపెన్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్లీ ప్రస్తుతానికి రావడం మళ్ళీ ప్రస్తుతం నుంచి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లడం ఇలా స్క్రీన్ ప్లే ను నాన్ లీనియర్ స్టైల్ లో చెబుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశారు...
సాగర సంగమం - అర్జున్ రెడ్డి
నిజానికి 'కే విశ్వనాథ్' దర్శకత్వంలో 'కమల్ హాసన్' హీరోగా వచ్చిన 'సాగర సంగమం' సినిమా స్క్రీన్ ప్లే కూడా నాన్ లీనియర్ గానే సాగుతుంది. మొదట హీరో ఫెయిల్యూర్ స్టోరీ తో కథ స్టార్ట్ అవుతుంది. కమల్ హాసన్ ఒక పేపర్ ప్రింటింగ్ ఆఫీస్ లోకి వచ్చి డ్యాన్స్ రాని ఒక అమ్మాయిని నాట్య మయూరి అని పేపర్ లో కథనం ఎలా వేస్తారు అంటూ వాళ్ళను నిలదీస్తాడు. దాంతో అక్కడి సిబ్బంది అతన్ని ఒక పిచ్చోడు అని అనుకుంటారు. కానీ తనకి మెంటల్ లేదని అసలు డ్యాన్స్ అంటే ఏంటి కూచిపూడి, భరతనాట్యం, కథాకళి మూడింటిలో ఉన్న తేడా ఏంటి అనేది డ్యాన్స్ చేసి చూపిస్తాడు. అంటే మొదటి సీన్ లోనే అతనికి డ్యాన్స్ మీద తన కల మీద ఎంత గ్రిప్ ఉందో దర్శకుడు చూపిస్తాడు. అక్కడి నుంచి తన ఫ్లాష్ బ్యాక్ లోకి స్టోరీ వెళ్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో కూడా డాక్టర్ అంటూ ఆయన క్యారెక్టర్ ను పరిచయం చేస్తు ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ తో పాటు చెడు వ్యసనాలు అన్నింటిని పరిచయం చేస్తాడు. తను డాక్టర్ గా ట్రీట్ మెంట్ ఎలా చేస్తాడు అనేది పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. ఆ తరువాత నుంచి మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి కాలేజీ స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సాగర సంగమం స్క్రీన్ ప్లే కి అర్జున్ రెడ్డి స్క్రీన్ ప్లే కి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఏది ఏమైనా కూడా పర్ఫెక్ట్ స్టోరీ ని చెప్పడానికి దానికి సెట్ అయ్యే స్క్రీన్ ప్లే ను వాడుతుంటారు...
స్క్రీన్ ప్లే ఒకటే పాత్రల స్వభావం వేరు
కొన్ని విషయాల్లో ఈ రెండు సినిమాల స్క్రీన్ ప్లే ఒకేరకంగా అనిపించిన రెండింటి థీమ్ వేరు... ఇక హీరోల పాత్రల స్వభావం కూడా వేరు. కానీ కొన్ని విషయాల్లో సాగర సంగమం లోని బాలు క్యారెక్టర్ కి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇద్దరు వాళ్ల రంగాల్లో ప్రతిభావంతులు అలాగే ఒకే అమ్మాయి ని చాలా డీప్ గా లవ్ చేస్తారు. తమ ప్రేమ ను కోల్పోయామనే బాధలో మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతారు తప్ప మరో అమ్మాయిని లవ్ చేయరు...ఈ విషయాల్లో ఈ రెండు క్యారెక్టర్లకి సంబంధమైతే ఉంది. ఇక పాత్రల స్వభావం చూసుకుంటే బాలు అమాయకుడు, మృదు స్వభావి, కానీ అర్జున్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. తను అనుకున్నది చేసే మొండితనం కలవాడు. అర్జున్ రెడ్డి ది హ్యాపీ ఎండింగ్ అయితే బాలు ది మాత్రం సాడ్ ఎండింగ్ అనే చెప్పాలి. తన శిష్యురాలు నృత్య ప్రదర్శన చేసి అవార్డ్ అందుకున్న మూమెంట్ ను చూసిన బాలు అక్కడే మరణిస్తాడు. ఇలా కొన్ని విషయాల్లో మాత్రమే ఈ రెండు మూవీస్ స్క్రీన్ ప్లే లు ఒకేలా అనిపిస్తుంటాయి... అలాగే ఈ ఇద్దరు దర్శకులు మూవీస్ ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తానికైతే ఈ రెండు మూవీస్ కూడా తెలుగులో క్లాసిక్ మూవీస్ గా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి...
