Begin typing your search above and press return to search.

ఆరేళ్ల సహజీవనం.. ఇద్దరు పిల్లలు.. అర్జున్ కి అలాంటి సమస్య ఉంది - గాబ్రియెల్లా..

తాజాగా ప్రముఖ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఈ జంట.

By:  Madhu Reddy   |   16 Dec 2025 1:21 PM IST
ఆరేళ్ల సహజీవనం.. ఇద్దరు పిల్లలు.. అర్జున్ కి అలాంటి సమస్య ఉంది - గాబ్రియెల్లా..
X

సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కొంతమంది సెలబ్రెటీలు తమకు నచ్చిన వారితో సహజీవనం చేసి.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత.. వారి సమక్షంలో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా వచ్చి చేరారు. ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు తన ప్రేయసితో దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసి.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. ఇప్పుడు వారి సమక్షంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని క్లారిటీ ఇచ్చారు.

అసలు విషయంలోకి వెళ్తే.. గత రెండు రోజులుగా ప్రముఖ బాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్ అర్జున్ రాంపాల్.. ఊపిరి మూవీ బ్యూటీ గాబ్రియెల్లాతో నిశ్చితార్థం జరిగింది అంటూ వార్తలు వెలువడుతున్న వేళ ఈ జంట స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రముఖ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఈ జంట. ఇందులో అర్జున్ రాంపాల్ తమ రిలేషన్షిప్ గురించి వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు.

అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.."త్వరలోనే మేమిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఇప్పుడు మాకు నిశ్చితార్థం అయ్యింది"అంటూ తెలిపారు. ఇక ఈ మాట వినగానే షో నిర్వాహకురాలు రియా చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయింది.. ఇదే షోలో గాబ్రియెల్లా కూడా మాట్లాడుతూ.. "ఎవరైనా సరే ప్రేమించుకున్నప్పుడు వారు పెళ్లి చేసుకోవాలంటే పెద్దల అనుమతి తప్పనిసరి. అయితే మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా పెద్దల అంగీకారం కోసం ఎదురు చూడలేము. అందుకే మేము నిశ్చితార్థం చేసుకున్నాము" అంటూ క్లారిటీ ఇచ్చింది.

అర్జున్ రాంపాల్ కి ఉన్న సమస్య గురించి కూడా మాట్లాడుతూ.. "ఈయనకు ఓసీడీ సమస్య ఉంది. ఉదాహరణకు నేను టూత్ పేస్ట్ క్యాప్ తీసి పక్కన పెట్టి.. మళ్లీ క్యాప్ పెడదామనుకునే లోపే నాపై అరిచేస్తాడు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాను.. పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆయనకున్న ఈ ఓసీడీ సమస్య నాకు పెద్దగా అనిపించలేదు. ఆయనపై ఉన్న ప్రేమే నన్ను తల్లిని చేసింది. అందుకే మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ అర్జున్ రాంపాల్ కి ఉన్న ఓసీడీ సమస్య గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ..

నాగార్జున, కార్తీ, తమన్నా, అనుష్క శెట్టి, శ్రియ శరన్ కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన చిత్రం ఊపిరి..ఇందులో స్పెషల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది గాబ్రియెల్లా. అలాంటి ఈమె 2019 నుంచి అర్జున్ రాంపాల్ తో డేటింగ్ లో ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎక్కడ కూడా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అటు అర్జున్ రాంపాల్ ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దీనికి తోడు తాజాగా వచ్చిన దురంధర్ అనే సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. ఇకపోతే అర్జున్ రాంపాల్ కి ఇదివరకే ప్రముఖ మోడల్ , నిర్మాత అయిన మెహర్ జెసియాతో పెళ్లి జరిగింది. మనస్పర్ధలు రావడంతో 2018లో విడిపోయారు. ఇక అప్పటినుంచి గాబ్రియెల్లాతో ఆయన డేటింగ్ లో ఉన్నారు.

అర్జున్ వయసు 53 సంవత్సరాలు కాగా, ఈమె వయసు 38.. అంటే వీరిద్దరి మధ్య ఏకంగా 15 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.