మాజీ ప్రియురాలికి బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరో
బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అందుకే ఏ విషయాన్నైనా ఉన్న దాని కంటే ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్తుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 6:22 PM ISTబాలీవుడ్ సెలబ్రిటీలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అందుకే ఏ విషయాన్నైనా ఉన్న దాని కంటే ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్తుంటారు. అందుకే బ్రేకప్స్ అయ్యాక కూడా వారు చాలా నార్మల్ గా ఉండగలరు. బయట ఎక్కడైనా అనుకోకుండా కలిసినా చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అసలు ఇదంతా ఎందుకంటే బాలీవుడ్ భామ మలైకా అరోరా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
మలైకాకు అర్జున్ బర్త్ డే విషెస్
ఆమె అభిమానుల నుంచి, ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల నుంచి మలైకాకు బర్త్ డే విషెస్ వస్తుండగా, మలైకా మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్తూ ఆమె ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మలైకా, మీరెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలంటూ రాసుకొచ్చారు. అర్జున్ చేసిన పోస్ట్ కు మలైకా కూడా థాంక్ యూ అంటూ లవ్ సింబల్ ను జోడించి రిప్లై ఇచ్చారు.
అర్జున్ బర్త్ డే విష్ చేసిన మలైకా
అయితే మొన్నా మధ్య జూన్ లో అర్జున్ కపూర్ బర్త్ డే కు, మలైకా కూడా సోషల్ మీడియాలో మాజీ బాయ్‌ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. కాగా మలైకా, అర్జున్ కపూర్ ఆరేళ్ల పాటూ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరూ విడిపోయారన్నారు. మొన్నామధ్య ఓ ఈవెంట్ లో అర్జున్ కపూర్ తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని చెప్పి తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చారు.
అయితే వారి బ్రేకప్ తర్వాత మలైకా తండ్రి చనిపోవడంతో అర్జున్ కపూర్, ఆమెను ఇంటికెళ్లి మరీ పరామర్శించారు. రీసెంట్ గా కూడా వీరిద్దరూ ముంబైలో జరిగిన హోమ్ బౌండ్ ప్రీమియర్ కు హాజరై ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. ఇప్పుడు మలైకాకు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పడంతో వీరి పాత రిలేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది.
