కోలాలు ఎలక్ట్రోలైట్‌లు ఈ హీరోలు నిజంగా తాగుతారా?
ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ప్రచారంలో బిజీగా ఉన్న అర్జున్ కపూర్, ఇలాంటి వృధా ప్రయాస ప్రకటనల కంటే నటుడిగా కెరీర్ పై దృష్టి సారిస్తే బావుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
By: Sivaji Kontham | 14 Aug 2025 8:00 PM ISTకొందరు కోలాలకు విస్త్రత ప్రచారం కల్పిస్తున్నారు. పురుగు మందు అవశేషాలు మెదడుపై ప్రభావం చూపిస్తున్నా, వాటిని యువతరం యథేచ్ఛగా తీసుకుంటుంది. ఆర్టిఫిషియల్ పండ్ల రసాలను సేవించడం ఎక్కువైంది. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఎలక్ట్రోలైట్ తీసుకోమంటున్నాడు. జిమ్ లో బాగా శ్రమించిన తర్వాత, నైట్ అవుట్లు చేసిన తర్వాత ఎలక్ట్రోలైట్ బాగా శక్తినిస్తుందని చెబుతున్నాడు.
నిజానికి ఈ ప్రచారకర్తలంతా ఫ్రెష్ గా తోటలోంచి తెచ్చిన కూరగాయలు, ఆకు కూరలు తినమని చెప్పరు. పెరడులోని పండ్లు కోసుకుని తిని, కొబ్బరికాయ నీళ్లు, సబ్జా లాంటి ఆరోగ్యకరమైనవి తాగమని అసలే చెప్పరు. అహంకారపు అగ్రరాజ్యం అమెరికా నుంచి దిగుమతి అయ్యే కోలాలను తాగాలని బలవంతంగా రుద్దుతారు. ఆర్టిఫిషియల్‌గా రూపొందించే ఎలక్ట్రో లైట్ లు చాలా నాన్ బ్రాండ్ వి కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. అయినా కానీ వాటికి సెలబ్రిటీలు కావాల్సినంత ప్రచారం చేస్తున్నారు. కోలాలు ఎలక్ట్రోలైట్‌లు ఈ హీరోలు నిజంగా తాగుతారా? మార్కెట్లోనో, రోడ్ సైడ్ బండి దగ్గరకో వెళ్లి కొబ్బరి నీళ్లు తాగకుండా ఉన్నారా?
ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ప్రచారంలో బిజీగా ఉన్న అర్జున్ కపూర్, ఇలాంటి వృధా ప్రయాస ప్రకటనల కంటే నటుడిగా కెరీర్ పై దృష్టి సారిస్తే బావుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక ప్రయివేట్ ప్రకటనపై చూపించిన ఆసక్తి సినిమాలపై చూపించి ఉంటే నటుడిగా చాలా పేరు తెచ్చుకునేవాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇషాక్ జాదే తర్వాత అర్జున్ కపూర్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. సరైన విజయాలు అతడిని వరించలేదు.
మధ్యలో ఎఫైర్ కథలు అతడికి శాపంగా మారాయి. ఐటమ్ గాళ్ మలైకా అరోరాతో షికార్ల కారణంగా అతడిని ఇండస్ట్రీ కూడా పెద్దగా పట్టించుకోలేదని గుసగుసలు వినిపించాయి. సల్మాన్ కాంపౌండ్ అతడిని పూర్తిగా నిషేధించడం బోనీకపూర్ ని కలతకు గురయ్యేలా చేసింది. అగ్రనిర్మాత బోనీ ఒక సందర్భంలో పబ్లిగ్గానే ఈ విషయంలో వాపోయాడు. పుత్రరత్నం చేసిన పనికి సల్మాన్ కుటుంబంతో తన అనుబంధం తెగిపోయిందని బాధపడ్డాడు. అందుకే ఇకనైనా అనవసర ప్రచారాలను మించి కెరీర్ కోసం ఏదైనా చేయాలని విమర్శకులు సూచిస్తున్నారు.
