స్టార్ హీరో చిత్రంలో 'ఖైదీ' విలన్!
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ `ఖైదీ`తో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఒక్క విజయం అర్జున్ కెరీర్ నే మార్చేసింది.
By: Srikanth Kontham | 24 Sept 2025 9:55 AM ISTకోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ `ఖైదీ`తో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఒక్క విజయం అర్జున్ కెరీర్ నే మార్చేసింది. అతడి హస్కీ వాయిస్ తో మరింత వెలుగులోకి వచ్చాడు. అతడి వాయిస్ కే అవకాశాలు కల్పించిన దర్శకులెంతో మంది. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సైతం అర్జున్ దాస్ వాయిస్ గురించి మాట్లాడారంటే అతడెంత ప్రత్యేకమే చెప్పొచ్చు. నటుడిగా కొనసాగుతూనే అవసరం మేర వాయిస్ ఓవర్ సైతం అందిస్తూ మరింత ఫేమస్ అవుతున్నాడు. టాలీవుడ్ అతడిని హీరోగానూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.
కోలీవుడ్ లో బిజీ నటుడు:
`బుట్టబొమ్మ`లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `ఓజీ`లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో ఇది రెండవ చిత్రం కావడం విశేషం. పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమయ్యాడంటే? హిట్ అయితే అర్జున్ దాస్ మరింత బిజీ అవుతాడు. మెయిన్ లీడ్స్ లో ఎంపికకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తమిళ్ లో మాత్రం పుల్ బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ ఏకంగా `డాన్ 3` తోనే లాంచ్ అవ్వడం విశేషం.
విలన్ గా పర్పెక్ట్ ఛాయిస్:
రణవీర్ సింగ్ కథానాయకుడిగా హిట్ ప్రాంచైజీ `డాన్` నుంచి `డాన్ 3`కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. పర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఓ విలన్ పాత్రకు అర్జున్ దాస్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఖైదీ, విక్రమ్, మాస్టర్ చిత్రాల్లో అర్జున్ దాస్ పోషించిన పాత్రలు చూసి పర్హాన్ తాను రాసిన ఓ పాత్రకు అర్జున్ పర్పెక్ట్ గా యాప్ట్ అవుతాడని భావించి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
15 ఏళ్ల తర్వాత మరోసారి:
ఇదే చిత్రంలో షారుక్ ఖాన్, అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రంలో ఇంకా మరింత మంది స్టార్లు యాడ్ అవుతారని వినిపిస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ లాంటి భామలు ఎంటర్ అవుతున్నారే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. `డాన్` తొలి చిత్రం 1978 లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అటుపై `డాన్2` 2011లో షారుక్ ఖాన్ హీరోగా పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో నే రిలీజ్ అయింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత `డాన్ 3` పట్టాలెక్కిస్తున్నారు.
