థియేటర్ల లెక్క ఎక్కడ మారింది?
గడిచిన ఏడాదిన్నర కాలంలో బాక్సాఫీస్ నంబర్లు చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. కొన్ని సినిమాలు ఏకంగా ఎనిమిది సినిమాలు బిలియన్ డాలర్ల మార్క్ దాటేసి రికార్డు సృష్టించాయి.
By: M Prashanth | 14 Aug 2026 8:30 AM ISTస్ట్రీమింగ్ యాప్‌లు వచ్చాక థియేటర్లకు జనాలు వెళ్లడం లేదనేది పైకి కనిపిస్తున్న మాటే. కానీ అసలు నిజం ఏంటంటే, ప్రేక్షకులు సినిమాలు చూడటం తగ్గించలేదు. తమ డబ్బులు, టైమ్ దేనికి కేటాయించాలనే విషయంలో వాళ్ల సెలక్షన్ మారింది. ఒక్కప్పుడు ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడక తప్పేది కాదు. ఇప్పుడు అలా కాదు, కొద్ది రోజులు వెయిట్ చేస్తే ప్రశాంతంగా ఇంట్లోనే చూసే ఆప్షన్ ఉంది. అందుకే పక్కా రీజన్ ఉంటే తప్ప ఆడియన్స్ హాల్ దాకా రావడం లేదు.
ఈ మార్పును చూసి చాలామంది "థియేటర్లు పాతబడిపోయాయి" అని పొరబడ్డారు. ఏప్రిల్ 2025లో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారాండోస్ కూడా సరిగ్గా ఇలాంటి మాటే చెప్పారు. చాలామందికి హాల్‌కి వెళ్లడమే ఒక పాత ఆలోచనగా మారిందన్నారు. కానీ ఆ తర్వాత ప్రపంచ బాక్సాఫీస్ వద్ద జరిగిన పరిణామాలు దీనికి పూర్తిగా రివర్స్ రెస్పాన్స్ ఇచ్చాయి. సరైన విజువల్స్, లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఓటీటీని పక్కనపెట్టి మరీ జనాలు టికెట్ విండోల దగ్గర క్యూ కట్టారు.
గడిచిన ఏడాదిన్నర కాలంలో బాక్సాఫీస్ నంబర్లు చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. కొన్ని సినిమాలు ఏకంగా ఎనిమిది సినిమాలు బిలియన్ డాలర్ల మార్క్ దాటేసి రికార్డు సృష్టించాయి. లీలో అండ్ స్టిచ్, జూటోపియా 2, అవతార్: ఫైర్ అండ్ యాష్ లాంటి విజువల్ గ్రాండియర్స్ థియేటర్లలో సునామీ సృష్టించాయి. మరోవైపు యానిమేషన్ ప్రపంచంలో ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ, టాయ్ స్టోరీ 5 రికార్డులు సృష్టిస్తే, మాస్ ఈవెంట్ సినిమాలైన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేశాయి.
వీటిలో ఏ ఒక్కటి కూడా ఒకే జోనర్‌కి చెందినవి కావు. యానిమేషన్, సైన్స్ ఫిక్షన్, బయోపిక్, సూపర్ హీరో.. కంటెంట్ ఏదైనా సరే, బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ దక్కుతుంది అనిపించిన ప్రతి మూవీకీ ఆడియన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడ అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, రెగ్యులర్ డ్రామాలు, యావరేజ్ కంటెంట్ ఉన్న ప్రాజెక్టుల దగ్గరే. "ఈ సినిమా కోసం థియేటర్ దాకా వెళ్లాలా? ఎలాగో మూడో వారంలో ఓటీటీలోకి వస్తుంది కదా" అనే థాట్ జనాల్లో బలంగా నాటుకుపోతోంది.
ఓటీటీ తెచ్చిన కన్వీనియన్స్ వల్ల నార్మల్ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మనుగడ కష్టంగా మారింది తప్ప, అసలైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలకు ఎలాంటి ఢోకా లేదు. అందుకే థియేటర్ల బిజినెస్ అయిపోయింది అనుకోవడం పొరపాటే. జనాలు ఇంకా థియేటర్ లవర్సే, కాకపోతే వాళ్ల సెలక్షన్ మారింది. విజువల్ స్కేల్, ప్రాపర్ ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్ లేదా బిగ్ స్క్రీన్ పైనే చూడాల్సిన ఈవెంట్ ఫీలింగ్ ఉన్నప్పుడు ప్రేక్షకులు రూపాయి వెనకాడకుండా టికెట్ కొంటున్నారు.
