Begin typing your search above and press return to search.

కోడ‌లు కాఫీ మెషీన్ కట్నంగా తెస్తుందా?

బాలీవుడ్ సీనియర్ నటి, పాపులర్ కామెడీ షో జడ్జ్ అర్చన పురాణ్ సింగ్ చలాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   5 May 2026 3:09 PM IST
కోడ‌లు కాఫీ మెషీన్ కట్నంగా తెస్తుందా?
X

బాలీవుడ్ సీనియర్ నటి, పాపులర్ కామెడీ షో జడ్జ్ అర్చన పురాణ్ సింగ్ చలాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సరదా స్వభావంతో అందరినీ నవ్విస్తుంటారు. వెండి తెరపైనే కాదు. నిజ జీవితంలో కూడా ఆమె చాలా సరదాఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. తాజాగా అర్చ‌న పురాణ్ సింగ్ పెద్ద కుమారుడు ఆయుష్మాన్ సేథీ తన గర్ల్‌ఫ్రెండ్ సమీక్షతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అర్చన ఆ నిర్ణయాన్ని ఎంతో సంతోషంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అర్చ‌న చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అర్చన కొడుకు- కోడలు కాబోయే అమ్మాయిని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తూ పెట్టిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

సమీక్ష తమ ఇంట్లోకి వ‌స్తున్న‌ సమయంలో తనతో పాటు ఒక కాఫీ మెషీన్ తీసుకొచ్చిందిట‌. దీనిపై అర్చన జోక్ చేస్తూ.. `సమీక్ష తనతో పాటు కాఫీ మెషీన్‌ను కట్నంగా తెచ్చింది. మా ఇంటికిప్పుడు ఒక కొత్త వ్యక్తితో పాటు మంచి కాఫీ కూడా తోడైంది` అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ ఆమెలోని హ్యూమర్ సెన్స్‌ను మరోసారి చాటిచెప్పింది. సాధారణంగా భారతీయ సమాజంలో కుమారుడు గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి రావడం లేదా పెళ్లికి ముందే కలిసి ఉండటం వంటి విషయాల్లో తల్లిదండ్రులు కొంత సంకోచిస్తుంటారు. కానీ అర్చన పురాణ్ సింగ్, ఆమె భర్త పర్మీత్ సేథీ మాత్రం ఈ విషయంలో ఎంతో ఆధునికంగా ఆలోచిస్తున్నారు.

పిల్లల వ్యక్తిగత ఇష్టాలకు, వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యమని ఇరువురు నమ్ముతున్నారు. సమీక్షను తమ కుటుంబంలో సభ్యురాలిగా అప్పుడే స్వీకరించేసినట్లు వారి మాటల్లోనే అర్థమవుతోంది. సమీక్ష తమ ఇంట్లోకి రావడాన్ని అర్చన ఒక వేడుకలా భావిస్తున్నారు. `సమీక్ష చాలా మంచి అమ్మాయి. ఆమె రాకతో మా ఇల్లు మరింత కళకళలాడుతోంది` అని కొనియాడారు. అత్తగానే కాకుండా ఒక స్నేహితురాలిగా ఆమెతో మెలగాలని అనుకుంటున్నట్లు అర్చన పరోక్షంగా తెలిపారు.

ఆధునిక కాలంలో అత్తాకోడళ్ల బంధం ఎలా ఉండాలో అర్చన తన ప్రవర్తన ద్వారా చూపిస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. `అర్చన గారు మీరు నిజంగా గ్రేట్. ఇలాంటి అత్త దొరకడం సమీక్ష అదృష్టం అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, కట్నం అనే పదాన్ని ఇంత సరదాగా వాడటం మీకే సాధ్యం` అని మరికొందరు నవ్వుతున్నారు. సెలబ్రిటీ కుటుంబాల్లో ఉండే ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం పట్ల నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అర్చన పురాణ్ సింగ్ కుటుంబ విషయాలను ఇంత ఓపెన్‌గా పంచుకోవడం ఆమె నిజాయితీని తెలియజేస్తోంది. కట్నం వంటి సామాజిక అంశాన్ని కాఫీ మెషీన్‌తో పోలుస్తూ ఆమె వేసిన జోక్, సీరియస్ విషయాలను కూడా ఎంత తేలికగా తీసుకోవచ్చో చూపిస్తోంది. ఆయుష్మాన్ -సమీక్షల కొత్త ప్రయాణం సుఖంగా సాగాలని ఆ ఇంట్లో నవ్వులు పూయాల‌ని అభిమానలు కోరుకుంటున్నారు.