జీవితంలో ఒక్కసారైనా అలా చేయాలి- శంబాల హీరోయిన్
తాజాగా మీడియాతో మాట్లాడిన ఈమె మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి అందరిని తన మాట తీరుతో ఆకట్టుకుంది.
By: Madhu Reddy | 25 Dec 2025 12:04 AM ISTప్రముఖ హీరో ఆది హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం శంబాల. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం.. అందులో భాగంగానే ఈ సినిమా విశేషాలను పంచుకుంది ఈ చిత్ర హీరోయిన్ అర్చన అయ్యర్.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఈమె మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి అందరిని తన మాట తీరుతో ఆకట్టుకుంది.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
నేను కూడా తెలుగమ్మాయినే. నా మాతృభాష తెలుగు. నేను చిత్తూరు జిల్లాలో జన్మించాను. కానీ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులో జరిగింది.
శంబాల ప్రీమియర్స్ కి వస్తున్న స్పందన ఏంటి?
శంబాల చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వేసిన ప్రతి ప్రీమియర్ హౌస్ ఫుల్ అవుతోంది. చాలా చోట్ల ఆడియన్స్ కూడా భయపడిపోతున్నారు.
ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి?
ఈ చిత్రంలో నేను దేవి అనే పాత్రలో నటిస్తున్నాను.
నా పాత్రను ఆడియన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆదితో నా కాంబినేషన్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే చాలామంది దర్శకులు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు.
డైరెక్టర్ శంబాల కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
ఈ సినిమా కథను పూర్తిగా వినకుండానే ఓకే చేశాను. ఇందులో స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ పాటలు, స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. ఇందులో చాలా డిఫరెంట్ పాత్ర నాది. నా కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర రావడం ఆనందంగా ఉంది.
శంబాల విషయంలో నిర్మాతలు సపోర్ట్ ఎలా ఉంది?
మా నిర్మాతలు మాకు చాలా సపోర్ట్ చేశారు. మధ్యలో బడ్జెట్ పెరిగినా ఎక్కడా కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. మా ఆర్టిస్టులు అందర్నీ ఎంతో బాగా చూసుకున్నారు.
ఆదితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
ఆదితో కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంతో తక్కువ మాట్లాడతారు. అద్భుతంగా నటిస్తారు. ఆయనతో మళ్ళీ మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను.
ఆడియన్స్ అభిరుచి చాలా మారింది కదా?
ప్రస్తుతం ఆడియన్స్ రెగ్యులర్ చిత్రాలను చూడడానికి ఇష్టపడడం లేదు. కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే థియేటర్లకి వస్తున్నారు. కరోనా తర్వాత ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది.
శంబాల సినిమా ఎలా ఉండబోతోంది?
ఈ సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే ఆ వైబ్ వస్తుంది. విజువల్, సౌండ్ పరంగా చాలా గొప్పగా ఉంది .అన్ని రకాల ఎమోషన్స్ చేస్తూ చేసిన ఈ చిత్రం క్రిస్మస్ కి మంచి వినోదాన్ని పంచుతుందని అనుకుంటున్నాను.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఫాంటసీ మూవీ చేస్తున్నాను. ఒక 500 సంవత్సరాల క్రితం జరిగిన కథ అది. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎప్పుడు కూడా నాకు కంఫర్ట్ గా ఉండే రోల్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.
ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కోరిక బలంగా ఉంది. అందుకే నా జీవితంలో ఒక్కసారి అయినా అలాంటి పాత్ర చేయాలని భావిస్తున్నాను. మంచి చిత్రాలు చేయాలి.. మంచి కథలు చెప్పాలి.. సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేయాలనే కోరిక బలంగా ఉంది.
మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉంది?
నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. మా అమ్మ , అన్నయ్య ఎప్పుడూ నాతోనే ఉంటారు. ముఖ్యంగా నా పాత్రల ఎంపిక విషయంలో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నా కలలకు ఎప్పుడు అండగా నిలుస్తుంటారు.
ఇప్పటివరకు సినిమా చూసినవారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి?
శంబాల ప్రీమియర్ చూసిన వాళ్లంతా నా పాత్ర చూసి షాక్ అవుతున్నారు. థియేటర్. నుంచి బయటకు వచ్చాక నన్ను చూసే తీరు వారిలో మారిపోయింది. నిజానికి ఇలాంటి పాత్రలు జీవితంలో మళ్లీ మళ్లీ రావు. దేవి లాంటి పాత్ర రావడం నా అదృష్టం.
