తండేల్ సినిమాను పోలీ ఉన్న ఆ వెబ్ సిరీస్.. ఏది ఒరిజినల్ బాసు?
ఒకే తరహా ఆలోచన ఇద్దరు వ్యక్తులకు రావడం సాధారమే. సినిమాలాంటి క్రియేటివ్ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువగా జరుగుతుంటుంది.
By: M Prashanth | 1 Aug 2025 7:25 PM ISTఒకే తరహా ఆలోచన ఇద్దరు వ్యక్తులకు రావడం సాధారమే. సినిమాలాంటి క్రియేటివ్ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువగా జరుగుతుంటుంది. అలా కొన్నింటిని ఎవరూ గుర్తుపట్టరు. కానీ కొన్నింటిని ఈజీగా పట్టేస్తారు నెటిజన్లు. ఇప్పుడు అలాంటిదానికి గురించే మనం మాట్లాడుకునేది. తాజాగా ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఇది అక్కినేని నాగ చైతన్య రీసెంట్ హిట్ తండేల్ సినిమా స్టోరీని పోలిన్నట్లు కనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే?
వచ్చే వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. నటుడు సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించగా, ఆనంది ఫిమేల్ లీడ్ గా చేసింది. ఇటీవల రిలీజైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే మాత్రం అందరికీ నాగ చైతన్య రీసెంట్ బ్లాక్ బస్టర్ తండేల్ గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇదే చర్చించుకుంటున్నారు.
తండేల్ లో శ్రీకాకుళం మత్స్యకారులు సముద్రంలో పొరపాటున పాకిస్థాన్ ఆర్మీకి చిక్కుతారు. ఇక అక్కడ జైళ్లో అనేక నష్టాలు పడటం, బయట వాళ్ల కుటుంబాలు వారిని విడిపించడం కోసం ఢిల్లీకి వెళ్లడం ఇదంతా తాజా వెబ్ సిరీస్ అరేబియా కడలో ఉంది. పాకిస్థాన్ పోలీస్ వ్యాన్ లో హీరో గ్యాంగ్ వెళ్తున్నప్పుడు దాడి జరిగే సీన్ కూడా ఈ రెండింట్లో ఒకేలా కనిపిస్తోంది. ఇంతలా ఒకేలా ఉండడం చూసి సినీ ప్రియులు షాక్ కు గురవుతున్నారు.
అయితే ఈ అరేబియా కడలి కథను చింతకింది శ్రీనివాస్ అనే ఓ విలేఖరి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. వివి సూర్యకుమార్ దర్శకత్వం వహించగా, క్రిష్ ఈ సిరీస్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తండేల్ సినిమా చిత్రీకరణలో సమయంలో ఈ కధకు సంబంధించి వివాదం కూడా జరిగినట్టు తెలిస్తుంది.
కానీ, నిజంగా ఏం జరిగిందో తెలీదు. అరేబియా కడలి సిరీస్ మాత్రం కొంత ఆలస్యంగా విడుదుల అవుతుంది. అయితే తండేల్ సినిమాకు, ఈ సిరీస్ కు మధ్య గ్యాప్ తక్కువ ఉండటం వల్ల పోలికలను ఈజీగా కనిపెట్టేస్తున్నారు. ఇక తండేల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి అలరించినట్లు, సత్యదేవ్, ఆనంది మెప్పిస్తారా లేదా చూడాలి.
