రెహమాన్ వెంటపడుతున్న టాలీవుడ్!
ఆ తరువాత కొన్నేళ్లకు నీ మనసు నాకు తెలుసు, మళ్లీ కొంత విరామం తరువాత మహేష్ `నాని`, ఏమాయ చేసావె, కొమురం పులి, సాహసమే స్వాసగా వంటి సినిమాలు చేశాడు.
By: Tupaki Entertainment Desk | 11 Feb 2026 3:17 PM ISTరెహమాన్.. కొన్నేళ్ల విరామం తరువాత దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. `కమ్యూనల్` వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ఆస్కార్ విన్నర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఆయన వెంటపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు దేవిశ్రీప్రాసాద్, తమన్, ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చుట్టూ తిరిగిన మేకర్స్ ఇప్పుడు కొత్తగా రెహమాన్ జపం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ కోటీ వద్ద కీ బోర్డ్ ప్లేయర్‌గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేశాడు రెహమాన్.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం `రోజా`తో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి తొలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ఆ తరువాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ `యోధ`, రేవతి `పుతియము ముగం`, శంకర్, అర్జున్‌ల `జెంటిల్‌మెన్` వంటి సినిమాలకు సంగీతం అందించి యూత్‌ని ఉర్రూతలూగించారు. తొలిసారి 1993 నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా `నిప్పురవ్వ`కు సంగీతంఅందించి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తరువాత వెంకటేష్ `సూపర్ పోలీస్`, డా. రాజశేఖర్ `గ్యాంగ్ మాస్టర్`లకు కూడా మ్యూజిక్ చేశారు.
ఆ తరువాత కొన్నేళ్లకు నీ మనసు నాకు తెలుసు, మళ్లీ కొంత విరామం తరువాత మహేష్ `నాని`, ఏమాయ చేసావె, కొమురం పులి, సాహసమే స్వాసగా వంటి సినిమాలు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తరువాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటం గమనార్హ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల కాంబినేషన్‌లో వస్తున్న `పెద్ది`కి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడక్షన్ కంపనీలు ఇప్పుడు రెహమాన్ వెంటపడుతున్నాయి.
`పెద్ది` వంటి పాన్ ఇండియా మూవీ తరువాత ఏ.ఆర్.రెహమాన్ తెలుగులో మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేయబోతున్నాడు. ఇప్పటికే వీటికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. బాబి కొల్లి డైరెక్షన్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీకి ఏ.ఆర్. రెహమాన్ సంగీత్ం అందించబోతున్నాడు. దీనితో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా `మనం` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నాడు.
దీనికి కూడా రెహమాన్ ని ఫైనల్ చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు మరో భారీ పాన్ ఇండియా మూవీకి కూడా రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్. `రంగస్థలం` తరువాత వీరిద్దరు కలిసి ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. పుష్పకు మించిన స్టోరీతో దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించనున్న ఈమూవీకి కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతుండటం గమనార్హం. ఇలా కొన్నేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
