మతమౌడ్యుల గుండెల్లోకి శూలం దించాడు
ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎవరు ఏ మతాన్ని అయినా స్వీకరించగలరు. భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతదేశంలో తప్ప ఇంకెక్కడా చూడలేం.
By: Sivaji Kontham | 22 Nov 2025 10:00 PM ISTప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎవరు ఏ మతాన్ని అయినా స్వీకరించగలరు. భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతదేశంలో తప్ప ఇంకెక్కడా చూడలేం. అప్పటివరకూ హిందువుగా ఉన్న దిలీప్ కుమార్ ఉన్నట్టుండి సూఫీ మార్గాన్ని ఎంచుకుని ముస్లిముగా మారాడు. మతమార్పిడి తర్వాత ఏ.ఆర్.రెహమాన్ గా పేరు మార్చుకున్నాడు. అయితే అతడు ఉన్నట్టుండి మతం ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే దానికి రెహమాన్ ఇచ్చిన సమాధానం హృదయాలను గెలుచుకుంది.
తాను సూఫీని స్వీకరించే ముందు అన్ని మతాలపైనా స్టడీ చేసానని రెహమాన్ వెల్లడించారు. ''సూఫీ మతం చనిపోవడానికి ముందు చనిపోవడం లాంటిది... ఎవరూ ఈ మతంలోకి మారాలని బలవంతం చేయరు. సూఫీ మతం నన్ను ఆధ్యాత్మికంగా మార్చింది. నా తల్లిని కూడా బాగు చేసిందని'' ఏ.ఆర్.రెహమాన్ తెలిపారు. తాను సూఫీలోకి మారడానికి ముందు హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి బాగా అధ్యయనం చేసానని కూడా రెహమాన్ వెల్లడించారు. తాను అన్నిమతాలకు అభిమానిని అని కూడా రెహమాన్ తాజా పాడ్ కాస్ట్ లో చెప్పారు.
మతం ఏది అనేది ముఖ్యం కాదు. మతం పేరుతో ప్రజలను చంపడం లేదా హాని కలిగించడం మాత్రమే సమస్య అని ఆయన అన్నారు. రకరకాల భాషలు మాట్లాడే విభిన్న మతాల వ్యక్తులు ఒకే వేదికపైకి షో చేయడానికి వస్తారని, వారంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని కూడా రెహమాన్ వెల్లడించారు.
హిందూ మతం నుండి సూఫీ మతంలోకి మారడం గురించి రెహమాన్ నిజాయితీగా చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈరోజుల్లో పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా దేవుడి విలువ ప్రజలకు తెలుస్తోంది. నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మారేవారి సంఖ్య అమాంతం పెరుగుతోంది.
ఏ.ఆర్.రెహమాన్ చాలా గ్యాప్ తర్వాత ఓ టాలీవుడ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పెద్ది చిత్రానికి ఆయన స్వరాలు అందిస్తున్నారు. `పెద్ది` నుంచి మొదటి సింగిల్ గ్లింప్స్ కూడా విడుదలై కుర్రకారు హృదయాలను దోచుకుంది.
