Begin typing your search above and press return to search.

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

‘రామాయణం’ సినిమా కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ 10 నుంచి 12 సినిమాల అవకాశాలను వదులుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర సంగీతం కోసం మూడేళ్లు పనిచేశామని, ‘రావణ తాండవ్’ పాటను 12 నుంచి 13 వెర్షన్లలో రూపొందించామని తెలిపారు. హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందని గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   23 Nov 2026 2:51 PM IST
రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!
X

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన `రామాయణం` మొద‌టి భాగం కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పడ్డ కష్టం.. చేసిన త్యాగం గురించి బయటకొచ్చిన విషయాలు సంగీత ప్రియులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం రెహాన్ దాదాపు 10 నుంచి 12 సినిమా అవకాశాలను వదులు కున్నానని తాజాగా వెల్లడించారు. ఎంతోమంది పెద్ద దర్శకుల ప్రాజెక్టులను పక్కన పెట్టినప్పటికీ రామాయ‌ణం నిర్ణయం పట్ల = ఎంతో గర్వంగా ఉందని ఈ ప్రయాణం తన కళాత్మక ప్రవృత్తిని మరింత పోషించిందని రెహమాన్ చెప్పుకొచ్చారు.

గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెహమాన్, `రామాయణం` సంగీతం వెనుక ఉన్న మూడేళ్ల సుదీర్ఘ శ్రమను కళ్లకు కట్టారు. థీమ్స్.. బాణీలు సిద్ధం చేయడానికి తమ బృందం మూడేళ్ల పాటు పనిచేసిందని.. కొన్ని ట్రాక్‌లను అయితే 12 నుంచి 13 వెర్షన్ల దాకా మార్చి మార్చి కంపోజ్ చేశామని తెలిపారు. ముఖ్యంగా `రావణ తాండవ్` పాట విషయంలోనే ఏకంగా 12-13 వెర్షన్లు చేసిన తర్వాతే అందరికీ న‌చ్చింద‌ని.. ఆత‌ర్వాతే తుది రూపం కుదిరిందన్నారు.

సంప్రదాయ భారతీయ సంగీతానికి.. ఆధునిక అంతర్జాతీయ శబ్దాలకు మధ్య సమతుల్యత సాధించడం తనకు ఎంతో సవాలుగా అనిపించిందని రెహమాన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం.. భాషల వారీగా పాటల్లోని లోతును అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. తనకు మనస్ఫూర్తిగా నచ్చిన.. తన బృందాన్ని ఉత్తేజపరిచే ప్రాజెక్టులు మాత్రమే అంగీకరిస్తానని రెహమాన్ ఈ సంద‌ర్భంగా మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు `రామాయణం` పాటలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు.. విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. `రావణ తాండవ్` లో ఆశించిన స్థాయిలో సంప్రదాయ తీవ్రత లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా.. `మంగళ్ రంగ్` పాట శైలిపైనా కొంత చర్చ నడుస్తోంది. అయినా? సంగీత పరంగా తాము చేసిన ప్రయోగాలు, పడిన శ్రమ పట్ల రెహమాన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంతటి భారీ బడ్జెట్.. అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ అయినా? దాని వెనుక ఉండే సంగీతకారుడి నిబద్ధత.. ఏకాగ్రత ఎంత ముఖ్యమో రెహమాన్ మాటలు మరోసారి నిరూపించాయి. వరుస అవకాశాలను కాదని మరీ ఓ ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు రెహమాన్ పడిన తపన ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.