Begin typing your search above and press return to search.

దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్..

సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖలలో ఏదో ఒక శాఖలో సెటిల్ అయిన చాలామంది మిగతా వాటిల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   1 Jan 2026 11:09 AM IST
దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్..
X

సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖలలో ఏదో ఒక శాఖలో సెటిల్ అయిన చాలామంది మిగతా వాటిల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ అవకాశం అందరికీ లభిస్తుంది అన్న గ్యారెంటీ లేదు. కానీ అవకాశం లభిస్తే మాత్రం సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇండియా మ్యూజిక్ మ్యాస్ట్రోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, చార్ట్ బాస్టర్ పాటలతో తన టాలెంట్ ట్యూన్లకు ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా దర్శకుడిగా కనిపించబోతున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ విషయం తెలిసి ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ ఇప్పుడు డైరెక్టర్ గా మారనున్నారా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేయగా.. అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు తన అద్భుతమైన ట్యూన్ లతో ప్రసిద్ధి చెంది, ఏకంగా రెండుసార్లు ఆస్కార్ అవార్డును అందుకున్న ఏఆర్ రెహమాన్ నటుడిగా అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు ఆయన నటించబోయే ఆ సినిమాలో దర్శకుడిగా కనిపించబోతున్నారు అని తెలిసి అభిమానులు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరి ఏ ఆర్ రెహమాన్ నటించనున్న ఆ చిత్రం ఏంటి? ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఏ జానర్ లో ఆ సినిమా రాబోతోంది ? ఇలా పలు రకాల ప్రశ్నలను గుప్పిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ , హీరో ప్రభుదేవా నటించబోయే ఒక కామెడీ చిత్రం మూన్ వాక్ లో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. గతంలో కొన్ని పాటల్లో అతిథి పాత్రలో కనిపించినప్పటికీ.. ఇప్పటివరకు ఆయన పూర్తిస్థాయిలో పూర్తి నిడివి ఉన్న పాత్రను పోషించలేదు. అయితే ఇప్పుడు తొలిసారి మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తూ.. బిహైండ్ వుడ్స్ ప్రొడక్షన్ ద్వారా నిర్మించబడే ఈ మూన్ వాక్ చిత్రంలో ఏఆర్ రెహమాన్ దర్శకుడు పాత్ర పోషించడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఈ సినిమాలో ఒక యువ కోపిష్టి దర్శకుడిగా రెహమాన్ కనిపించనున్నారట. ఇది ఆయనకు నటుడిగా తొలి సినిమా కావడం విశేషం. ఏది ఏమైనా సంగీత దర్శకుడిగా ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన ఏ.ఆర్ రెహమాన్ ఇప్పుడు ఏకంగా నటుడిగా అందులోను దర్శకుడుగా తన పాత్రతో జీవించడానికి సిద్ధమైపోయారు. మరి నటుడిగా ఈయనకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ మూన్ వాక్ చిత్రం ద్వారా అటు ప్రభుదేవా, ఇటు రెహమాన్ ఇద్దరూ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. పైగా ఒక పాటను కూడా వీరిద్దరూ కలిసి చిత్రీకరించడం జరిగింది.

ఏ ఆర్ రెహమాన్ విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ , రికార్డ్ నిర్మాత, గాయకుడు, పాటల రచయిత, బహుళ వాయిద్యకారుడు ఇలా పలు రకాలుగా తన ఉనికిని చాటుకున్నారు. తన అద్భుతమైన టాలెంట్ తో ఆరు నేషనల్ అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక బాఫ్టా అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు, 18 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, భారత ప్రభుత్వం అందించే పద్మభూషణ్ తో పాటు మరెన్నో అవార్డులను దక్కించుకొని సంచలనం సృష్టించారు.