రెహమాన్.. ఇదే అవుట్ పుట్ కంటిన్యూ చేస్తే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది మూవీ విడుదలైన తర్వాత ప్రేక్షకులతో పాటు మూవీ ఎక్స్పర్ట్స్ ను ఆకర్షించిన అంశాల్లో సంగీతం కూడా ఒకటి.
By: M Prashanth | 4 Jun 2026 5:32 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది మూవీ విడుదలైన తర్వాత ప్రేక్షకులతో పాటు మూవీ ఎక్స్పర్ట్స్ ను ఆకర్షించిన అంశాల్లో సంగీతం కూడా ఒకటి. ఆ చిత్రానికి మ్యూజిక్ అందించిన ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మరోసారి తన స్పెషాలిటీ చాటుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్స్ లో ఒకటిగా మారిందని టాక్ వినిపిస్తోంది.
నిజానికి రిలీజ్ కు ముందే పెద్దిలోని చికిరి, రైరా రారా, మైసా సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కథలో భాగంగా వచ్చే ఆ పాటలు కేవలం ఎంటర్టైన్మెంట్ కే పరిమితం కాకుండా ఎమోషన్స్ ను మరింతగా ప్రేక్షకులను కనెక్ట్ చేశాయని అభిప్రాయం వినిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా మ్యూజికల్ ఇన్స్ట్రటుమెంట్స్ యూజ్ చేయడంతో సాంగ్స్ నేచురల్ గా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అయితే సినిమాలో ఎక్కువ ప్రశంసలు అందుకుంటున్న అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోరే. కీలక సన్నివేశాల్లో రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో రెహమాన్ మ్యూజిక్ స్టోరీకి గట్టిగా హెల్ప్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో పెద్ది కథ 1990ల కాలం నాటి విజయనగరం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ఎన్విరాన్మెంట్ ను గుర్తు చేసేలా రెహమాన్ స్వరాలు సమకూర్చిన తీరు ప్రత్యేకంగా కనిపించిందని సినీ అభిమానులు చెబుతున్నారు. మోడ్రన్ మ్యూజిక్ స్టైల్ ను పూర్తిగా ఫాలో అవ్వకుండా.. సీజనాలుగు సెంటిమెంట్ ను రిఫ్లైక్ చేసేలా రూపొందించడం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారిందని సినీ ప్రియులు పేర్కొంటున్నారు.
గత కొన్నేళ్లుగా సెలెక్ట్ చేసిన చిత్రాలకు సంగీతం అందిస్తున్న రెహమాన్.. పెద్దితో తెలుగు ప్రేక్షకులను మరోసారి ఫుల్ గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ సంగీత దర్శకుల హవా కొనసాగుతున్నప్పటికీ.. ఎక్స్పీరియన్స్, మ్యూజిక్ పై ఉన్న పట్టు ఇప్పటికీ తనదైన స్థాయిలో ఉందని ఆయన ఆ చిత్రం ద్వారా నిరూపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో మ్యూజిక్ కు పెరుగుతున్న ఇంపార్టెన్స్ నేపథ్యంలో రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులపై మేకర్స్ దృష్టి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలకు సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా మారుతున్న సమయంలో పెద్దికి గాను ఆయన ఇచ్చిన అవుట్ పుట్ ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందనే చెప్పాలి.
ఇప్పటికే ఇండియన్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రెహమాన్, ఇదే రేంజ్ అవుట్ పుట్ ను కొనసాగిస్తే టాలీవుడ్ లో కూడా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. యంగ్ జెనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తూనే, తన ప్రత్యేక శైలిని కొనసాగిస్తున్న రెహమాన్ మరోసారి సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఏదేమైనా పెద్ది విషయంలో రెహమాన్ వర్క్ కూడా కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
