రెహమాన్ కాన్సర్ట్.. క్లిక్కయ్యిందా లేదా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్.. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Nov 2025 7:00 PM ISTస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్.. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి చాలా గ్రాండ్ గా జరిగిన ఆ ఈవెంట్ కు పెద్ద ఎత్తున అభిమానులు, మ్యూజిక్ లవర్స్ తరలి వచ్చారు. రెహమాన్ తన లైవ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ తో ఓ రేంజ్ లో సందడి చేశారు.
అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో కాన్సర్ట్ కు వెళ్లి వచ్చిన వారు.. నెట్టింట రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి.. రెహమాన్ లైవ్ కాన్సర్ట్ కు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ ఈసారి హైదరాబాద్ కాన్సర్ట్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది.
అందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి.. మొత్తం కాన్సర్ట్ కేవలం మూడు గంటల్లో కంప్లీట్ అవ్వడం పట్ల అనేక మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రెహమాన్.. తెలుగు సాంగ్స్ చాలా తక్కువ పాడారని చెబుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఆయన.. అలా చేయడం పట్ల పెదవి విరుస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు తెలుగులో పలు స్ట్రయిట్ మూవీస్ కు రెహమాన్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆయా సినిమాల సాంగ్స్ అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు. కానీ ఆయన వర్క్ చేసిన మిగతా భాషల చిత్రాల డబ్బింగ్ వెర్షన్ల పాటలు మాత్రం తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. చాలా మంది ఫేవరెట్ గా నిలిచాయి.
ఇప్పుడు వాటిని కూడా రెహమాన్ పాడకపోవడంతో అనేక మంది మ్యూజిక్ లవర్స్.. నిరాశ వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే.. వేల రూపాయలు వెచ్చించి టికెట్స్ కొనుగోలు చేశామని.. కానీ తాము సాటిస్ఫై అవ్వలేదని కామెంట్లు పెడుతున్నారు. రెహమాన్ ఫ్యాన్స్ మాత్రం ఓకే అని చెబుతున్నారు.
దీంతో రెహమాన్ లైవ్ కాన్సర్ట్.. అందరినీ సాటిస్ఫై చేయలేదని చెప్పాలి. ఫ్యాన్స్ ను తప్ప మిగతా మ్యూజిక్ లవర్స్ ను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. అంచనాలను తాకలేదు. బ్లాక్ బస్టర్ గా నిలవలేదు. అయితే రెహమాన్ రీసెంట్ గా కంపోజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ లైవ్ ప్రెజెంటేషన్ ప్రతి ఒక్కరినీ మెప్పించడం విశేషం.
