Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా 'కాపీ' పోస్టులే.. రెహమాన్ రెస్పాండ్ అవుతారా?

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ పై కాపీ ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

By:  M Prashanth   |   26 Jan 2026 9:30 AM IST
ఎక్కడ చూసినా కాపీ పోస్టులే.. రెహమాన్ రెస్పాండ్ అవుతారా?
X

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ పై కాపీ ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రెహమాన్ పాత పాటలను ఫారిన్ తోపాటు ఇండియన్స్ సాంగ్స్ తో పోలుస్తున్నారు అనేక మంది నెటిజన్లు. కొన్ని ట్యూన్స్ ఒకేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి.

రెహమాన్‌ కు మంచి క్రేజ్ తెచ్చిన రోజా సినిమా పాటలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమాలోని పరువం వానగా నేడు కురిసేనులే పాట ట్యూన్‌ 1989లో వచ్చిన యానీ స్వరపరిచిన క్వైట్ మ్యాన్ పాటకు దగ్గరగా ఉందని కొందరు అంటున్నారు. రెండు పాటలను పక్కపక్కన పెట్టి వినిపిస్తూ పోలికలు చూపించే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పొన్నియన్ సెల్వన్ సినిమాలోని వీర రాజ వీర శూర పాటపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ ట్యూన్‌ గుండెచా బ్రదర్స్ పాడిన శివ సుత్తికి చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రెండు పాటల మ్యూజిక్‌ ను కలిపి వినిపిస్తూ కాపీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రెహమాన్ కెరీర్‌ లో కీలకమైన మా తుజే సలాం పాటపైనా చర్చ సాగుతోంది. ఆ పాట ఒక పాత హిందీ సినిమాలోని మెలోడీలా ఉందని కొందరు అంటున్నారు.

ప్రేమికుడు సినిమాలోని ముక్కాలా ముక్కాలా పాట కూడా ఆర్.డి. బర్మన్ స్వరపరిచిన మెహబూబా.. మెహబూబా నుంచి తీసుకున్న ట్యూన్ ల ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మూడు దశాబ్దాలుగా రాణిస్తున్న రెహమాన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆస్కార్ తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనకు దక్కాయి.

భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి రెహమాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన రాగాలు, స్కేల్స్ ఉంటాయని, అందుకే కొన్ని సాంగ్స్ ఒకేలా అనిపించడం సహజమని అంటున్నారు. ఇన్స్పిరేషన్ తీసుకోవడం, నేరుగా కాపీ చేయడం మధ్య తేడా చాలా తక్కువని వివరిస్తున్నారు.

రెహమాన్ అభిమానులు కూడా తమ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. రెహమాన్ తన వర్క్ తోనే ఆన్సర్ ఇచ్చారని చెబుతున్నారు. కొత్త ప్రయోగాలు చేయడమే ఆయన స్త్రెంగ్త్ అని అంటున్నారు. ఇప్పటివరకు కాపీ ఆరోపణలపై రెహమాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే సోషల్ మీడియాలో సాగుతున్న ఈ చర్చ ఇంకా ఎంతవరకు వెళ్లుతుందో చూడాలి. ఒరిజినాలిటీ, క్రియేటివిటీపై మళ్లీ పెద్ద చర్చ మొదలవడం మాత్రం ఖాయం.