రెహమాన్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఎంతకు దారితీస్తుందో?
నువ్వు ముస్లిం.. అయినా 4,000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిందూ ప్రతిష్టాత్మక మూవీ రామాయణంలో సంగీత దర్శకుడిగా నీకు అవకాశం ఇచ్చారా? అంటూ మండిపడుతున్నారు.
By: Madhu Reddy | 20 Jan 2026 12:42 AM ISTఆస్కార్ గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వివాదాలకు దూరంగా ఉండే ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటున్నారు..ముఖ్యంగా మతం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనపై తీవ్ర వ్యతిరేకత కలిగేలా చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక మీడియా సంస్థకు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో బాలీవుడ్ సినీ పరిశ్రమలో మహారాష్ట్ర మినహా.. కోలీవుడ్ తో పాటూ ఇతర ప్రాంతీయులపై పక్షపాతం చూపిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురయింది.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.." వ్యక్తిగతంగా నేనెప్పుడూ ఎలాంటి వివక్షతను ఎదుర్కోలేదు. కానీ సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దీనికి మతపరమైన అంశం కూడా ఒక కారణం కావచ్చు. గత 8 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోవడానికి కారణం మతం అనే నేను భావిస్తున్నాను అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. దీంతో చాలామంది ఈయనపై మండిపడ్డారు.
నువ్వు ముస్లిం.. అయినా 4,000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిందూ ప్రతిష్టాత్మక మూవీ రామాయణంలో సంగీత దర్శకుడిగా నీకు అవకాశం ఇచ్చారా? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు మతం గురించి మాట్లాడి ఎందుకు విమర్శలకు దారి తీస్తున్నారు అని నెటిజన్లు కూడా మండిపడగా.. దిగివచ్చిన ఏఆర్ రెహమాన్ అందుకు క్లారిటీ ఇచ్చారు.. తాను చిన్నప్పటి నుంచి మహాభారతం, రామాయణం చదువుతూ పెరిగానని.. ముఖ్యంగా మనిషి జీవితం ఎలా సాగాలి అనే విషయం అందులో సంక్షిప్తమై ఉందని.. కానీ ఇప్పట్లో పక్క వాళ్ళని తొక్కేసి ఎదగాలని చూస్తున్నారు. ముఖ్యంగా సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, సేవ చేయడమే నా లక్ష్యం.. ఎప్పుడు ఎవరికి బాధ కలిగించాలని కోరుకోలేదు" అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
అయితే ఏ ఆర్ రెహమాన్ పై నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.." ఇండియాలో చాలా పేరుపొందిన వ్యక్తి ఏఆర్ రెహమాన్. నాకు తెలిసినంతవరకు ఆయనకు రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువే ఇస్తూ ఉంటారు. అయితే మతపరమైన కారణాలతో బాలీవుడ్ లో తనకు పని దొరకడం లేదని ఆయన చెప్పారు.. ఒకవేళ మతపరంగానే అవకాశాలు లభిస్తున్నాయి అనుకుంటే ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వీళ్లంతా కూడా సూపర్ స్టార్స్.. ఫేమస్ వ్యక్తులే కదా.. పైగా వీళ్లంతా సంపన్నులు కూడా.. వీరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదే.. వారు ఏ మతానికి , ఏ సామాజిక వర్గానికి చెందినవారు అని ఎవరు ఆలోచించలేదే ..
ఒకరకంగా చెప్పాలి అంటే నాలాంటి వాళ్లకే ఇలాంటి కష్టాలు ఉంటాయి.. ఇటువంటివి ఏఆర్ రెహమాన్ దరిదాపుల్లోకి కూడా రావు . ముఖ్యంగా అన్ని మతాలవారు కూడా ఆయనను గౌరవిస్తారు. అలాంటి ఈయన మతపరమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది . ఇకపై ఆయనను చూసి జాలి పడాల్సిన అవసరం లేదు" అంటూ తస్లీమా తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎంతకు దారితీస్తాయో చూడాలి.
.
