చికిరి హిట్‌తో రెహమాన్ గేర్ మార్చేశారా?
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా కోసం రెహమాన్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆయన కేవలం రూ.6 కోట్లు మాత్రమే తీసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 21 April 2026 12:13 PM ISTభారతీయ సినీ సంగీతంలో అత్యంత ప్రభావవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరైన A.R. రెహమాన్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. కొంతకాలంగా ఆయన ప్రాజెక్టుల సంఖ్య తగ్గినట్టే కనిపించినా, తాజా పరిణామాలు చూస్తే రెహమాన్ మళ్లీ గట్టి కంబ్యాక్ మోడ్‌లోకి వచ్చారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రీసెంట్ గా పెద్ది నుంచి వచ్చిన చికిరి సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించడం ఆయనకు మళ్లీ భారీ డిమాండ్‌ను తీసుకొచ్చిందనే అభిప్రాయం బలపడుతోంది. రెహమాన్ స్పీడ్ స్లో అయినా, సౌండ్ మాత్రం ఇంకా బలంగానే ఉందని తెలుస్తోంది. ఆయన చేతిలో తక్కువ ప్రాజెక్టులే ఉన్నప్పటికీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని ఈ ఉదంతం చెబుతోంది.
పెద్ది కోసం రూ.6 కోట్లు
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా కోసం రెహమాన్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆయన కేవలం రూ.6 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఆయన గత సినిమాల పారితోషికంతో పోలిస్తే పెద్ది మూవీకి ఛార్జ్ చేస్తుంది తక్కువనే చెప్పాలి. ఇది ఇండస్ట్రీలో మారుతున్న బడ్జెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా ఆయన తీసుకున్న అడ్జస్ట్మెంట్‌గా భావించారు. కానీ అదే సమయంలో చికిరి సాంగ్ హిట్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక సాంగ్ భారీ స్థాయిలో వైరల్ కావడం వల్ల సంగీత దర్శకుడి మార్కెట్ వాల్యూ ఎంత వేగంగా పెరుగుతుందో చికిరి సాంగ్ ప్రూవ్ చేసింది.
వెంటనే రేట్ పెంచేసిన రెహమాన్
ఈ నేపథ్యంలో అదే ప్రొడక్షన్ హౌస్ మరో మిడ్ రేంజ్ ప్రాజెక్ట్ కోసం అతన్ని సంప్రదించగా, రెహమాన్ ఈసారి ఏకంగా రూ.10 కోట్ల వరకు కోట్ చేసినట్టు తెలుస్తోంది. రెహమాన్ కోట్ చేసిన రెమ్యూనరేషన్ కు సదరు నిర్మాతలు షాక్ అయ్యారని సమాచారం. ఈ భారీ రెమ్యూనరేషన్ జంప్ కేవలం రెమ్యునరేషన్ ఫ్లిప్ మాత్రమే కాకుండా, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తీసుకున్న స్ట్రాటజీ అని కొందరు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, ఈ పరిణామం అడాప్టబిలిటీ వర్సెస్ అగ్రెషన్ అనే కోణంలో కూడా చర్చకు దారి తీసింది. ముందు తక్కువ రేటుకే ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్న రెహమాన్, ఇప్పుడు భారీ రేట్ కోట్ చేయడం మార్కెట్‌కు సరిపోయే మార్పా? లేక తన బ్రాండ్ విలువను మరింత పెంచుకునే అగ్రెసివ్ స్టెప్ అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో స్టార్ హీరోల సిఫార్సులు, భారీ ప్రాజెక్టుల అంచనాలు కూడా ఈ డిస్కషన్‌ను మరింత వేడెక్కిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, చికిరి లాంటి ఒక్క హిట్ సాంగ్ ప్రభావం ఎంత దూరం వెళ్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రెహమాన్ కోట్ చేస్తున్న రేట్ జస్టిఫై అవుతుందా? అనే డిబేట్ కూడా ఊపందుకుంది. కొందరు ఆయన గ్లోబల్ స్టేచర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రేట్లు సరైనవే అంటుంటే, మరికొందరు నిర్మాతలపై ఇది అదనపు భారం అవుతుందని వాదిస్తున్నారు. ఏది ఏమైనా, రెహమాన్ పేరు చుట్టూ మళ్లీ చర్చలు తిరుగుతుండటం మాత్రం ఆయన డిమాండ్ ఇంకా తగ్గలేదని చెప్పే స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది.
