Begin typing your search above and press return to search.

25 ఏళ్ల నాటి ఐడియాతో మురగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్!

కానీ తమ డ్రీమ్ ప్రాజెక్టును నెరవేర్చుకోవడానికి అప్పుడు సమయం కాకపోయినా కొన్నేళ్ల తర్వాత అయినా వాటికి రూపం దాల్చేలా చేస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   1 Jan 2026 8:00 AM IST
25 ఏళ్ల నాటి ఐడియాతో మురగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్!
X

సాధారణంగా ఎవరైనా దర్శక రచయితలు తమ కెరియర్ మొదట్లో ఒక కథను ఎంతో అందంగా, అద్భుతంగా తయారు చేసుకుంటారు. దానిని పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతారు. కానీ ఆ కథ వర్కౌట్ కాకపోతే మరో కథను రాసుకోవాల్సి వస్తుంది. కానీ తమ డ్రీమ్ ప్రాజెక్టును నెరవేర్చుకోవడానికి అప్పుడు సమయం కాకపోయినా కొన్నేళ్ల తర్వాత అయినా వాటికి రూపం దాల్చేలా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఏ.ఆర్ మురగదాస్ కూడా ఏకంగా 25 ఏళ్ల నాటి తన తొలి ఐడియాతో ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కమర్షియల్ సబ్జెక్టులను మంచి మెసేజ్ తో చెబుతూ అప్పటికే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శంకర్ తో సమానంగా మంచి స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్న డైరెక్టర్ గా ఏ.ఆర్. మురగదాస్ మంచి పేరు సంపాదించుకున్నారు. మారుతున్న కాలంలో కొంచెం టైం తీసుకుంటూ తనదైన కొత్త తరహా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన తన నెక్స్ట్ సినిమాగా వస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికర సబ్జెక్టు ప్లాన్ చేస్తున్నట్లు రివీల్ చేశారు. ఒక కోతిని మెయిన్ లీడ్ లో పెట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల తమిళ్ మీడియాలో రివీల్ చేసినట్లు సమాచారం.

వాస్తవానికి ప్రయోగాత్మక సినిమాలు చేయడం మురగదాస్ కి కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆధునికతను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకేసి.. గ్రాఫిక్స్ తో కూడిన ఒక కామెడీ చిత్రాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే 2001లో స్టార్ హీరో అజిత్ తో ధీనా అనే సినిమా చేశారు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు చేయాలనుకుంటున్న ప్రాజెక్టును తాను మొదటిగా చేయాలి అనుకున్నారట.అలా తాను అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తున్న సమయంలోనే ఒక కోతిని పెట్టి సినిమా తీయాలని, పిల్లలకు నచ్చే విధంగా ఉండాలని అనుకున్నారట. అయితే ఆ సమయంలో అది కుదరలేదు.

అలా 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు తాను అనుకున్న తన ఫస్ట్ సినిమా చేయడానికి ఇప్పుడు సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు తాను ఎదురుచూసిన ఈ కథతో ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.