ఇప్పుడా కామెంట్లను లైట్ తీసుకోంటున్న నటి!
సన్నగా ఉంటే ఇంత సన్నగా ఉన్నావేంటని విమర్శించేవారని...లావుగా ఉన్న సమయంలో మరీ లావు అయితే ఎలా అంటూ? చాలా విమర్శలు ఎదుర్కున్నట్లు తెలిపింది.
By: Srikanth Kontham | 16 Sept 2025 5:00 AM ISTహీరోయిన్లు బాడీ షేమింగ్ కి గురవ్వడం పరిపాటే. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే చాలా మంది భామ లు శరీర సౌష్టవాలు కామెంట్లకు గురయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన ఏ నటైనా ఏదో దశలో ఈ రకమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిందే అన్నంతగా సన్నివేశం తయారైంది. ఆరంభంలో చాలా మంది నటీమణులు ఇబ్బంది పడినా కాల క్రమంలో అలవాటు గా మారడంతో పట్టించుకోవడం మానేసారు. తాజాగా మల యాళం నటి అపర్ణ బాలమురళి కూడా బాడీ షేమింగ్ కి గురైన నటిగా చెప్పుకొచ్చింది.
సన్నగా ఉంటే ఇంత సన్నగా ఉన్నావేంటని విమర్శించేవారని...లావుగా ఉన్న సమయంలో మరీ లావు అయితే ఎలా అంటూ? చాలా విమర్శలు ఎదుర్కున్నట్లు తెలిపింది. ఇవన్నీ పని గట్టుకుని చేసే కామెంట్ల గానే తాను భావిస్తానంది. కెరీర్ ఆరంభంలో ఇలాంటి కామెంట్లు చూసి బాధ పడేదన్నా అన్ని కానీ అదే పనిగా చేయడంతో అలవాటుగా మారిపోయిందన్నారు. అయితే ఇలా ధృడంగా మారడానికి మాత్రం చాలా సమయం పట్టిందన్నారు. ఒక్క రోజులో ఇలాంటి విమర్శలను లైట్ తీసుకోలేదని బాడీ షేమింగ్ గురించి మర్చిపోయిన ప్రతీసారి ఎవరో ఒకరు ఏదో రూపంలో గుర్తు చేసేవారన్నారు.
`ఓసారి చాలా దూరం విమాన ప్రయాణం చేసాను. ఎయిర్ పోర్టులో దిగిన అనంతరం ఓ వ్యక్తి నా దగ్గరకొచ్చి మీ రూపం ఇలా మారిపోయిందేంటి అన్నాడు. నేను సాక్ అయ్యాను. మొదట ఇలా అంటున్నాడేంటని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత కాసేపటికి అర్దమైందని నా శరీరం గురించి అతడు మాట్లాడుతున్నాడని. దీంతో అతనితో ఆ సమయంలో ఎలాంటి డిస్కషన్ పెట్టకుండా అక్కడ నుంచి కామ్ గా వెళ్లిపోయాను. కానీ అప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. సమాజంలో మహిళల గురించి ఇంత దిగజారి మాట్లా డాల్సిన పనేంటని అడగాలనిపించింది.
కానీ అది సరైన వేదిక కాదు కాబట్టి మాట్లాడలేదన్నారు. అపర్ణ బాల మురళి ఇంత వరకూ తెలుగు సినిమాలు చేయలేదు. సూర్య సరసన `ఆకాశం నీహద్దురా`లో నటించింది. కాని అది తమిళ అనువాద చిత్రం. అలాగే `ఆకాశం` అనే మరో తమిళ సినిమా కూడా చేసింది. ఆ సినిమా తెలుగింట రిలీజ్ అయిం ది. ఆ తర్వాత అపర్ణ నటించిన పరభాషా చిత్రాలేవి రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం మాలీవుడ్ లోనే సిని మాలు చేస్తోంది. అక్కడ కూడా ఏమంత యాక్టివ్ గా కనిపించలేదు. ఈ ఏడాది ఇంత వరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అలాగే తమిళ్లోనూ అప్పుడప్పుడు మెరుస్తోంది.
