సినీ 'ఎకో సిస్టమ్'.. టాలీవుడ్ విషయంలో AP సర్కార్ ప్లానేంటి?
లోకేశ్ కామెంట్స్ ను పరిశీలిస్తే.. ప్రభుత్వం కేవలం సినిమా షూటింగ్లను ఆహ్వానించడం మాత్రమే కాకుండా.. నిర్మాణం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవసరమైన మొత్తం సిస్టమ్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు అర్థమవుతోంది.
By: M Prashanth | 25 Jun 2026 8:00 PM ISTఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని కేవలం షూటింగ్లకే పరిమితం చేయకుండా.. సినీ హబ్ గా మార్చాలన్న టార్గెట్ తో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త మూవీ లాంఛింగ్ ఈవెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఆ కార్యక్రమంలో బాలయ్య అల్లుడు, నారా లోకేశ్ చేసిన కామెంట్స్.. ఏపీలో సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో క్లియర్ గా తెలియజేశాయి.
బాలకృష్ణ లీడ్ రోల్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం అమరావతిలో జరగ్గా, ఆ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారా లోకేశ్ సినిమా పరిశ్రమకు సంబంధించి గవర్నమెంట్ విజన్ ను వివరించారు. అమరావతిని కేవలం రూలింగ్ క్యాపిటల్ గానే కాకుండా.. క్రియేటివ్ ఇండస్ట్రీలకు సెంటర్ గా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు.
సినిమా పరిశ్రమతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని లోకేశ్ వెల్లడించారు. అందుకోసం అవసరమైన ఫెసిలిటీస్, ఫినిషింగ్ స్టూడియోలు, మోడ్రన్ టెక్నాలిజీని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చేలా ఎకో సిస్టమ్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకేచోట ఉండేలా ప్లాన్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
పెద్ద బ్యానర్, స్టార్ హీరో సినిమా అమరావతిలో ప్రారంభం కావడం ప్రభుత్వానికి సంతోషకర విషయమని లోకేశ్ అన్నారు. ఇదే ఒక్క సినిమాతో ఆగిపోకుండా.. ఫ్యూచర్ లో మరిన్ని మూవీలు కూడా అమరావతి నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాదు.. బాలకృష్ణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమను మరింత డెవలప్ చేసే విధంగా ముందుకు సాగుతామని కూడా ఆయన స్పష్టం చేశారు.
లోకేశ్ కామెంట్స్ ను పరిశీలిస్తే.. ప్రభుత్వం కేవలం సినిమా షూటింగ్లను ఆహ్వానించడం మాత్రమే కాకుండా.. నిర్మాణం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవసరమైన మొత్తం సిస్టమ్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఫిల్మ్ స్టూడియోలు, టెక్నికల్ సెటర్లు, క్రియేటివ్ ఫీల్డ్స్ కు అవసరమైన వసతులు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఇన్వెస్ట్మెంట్లు కూడా ఆకర్షించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
రీసెంట్ గా ఇండస్ట్రీకి సంబంధించి పర్మిషన్ల ప్రక్రియ ఈజీ చేయడం, పరిశ్రమకు అనుకూల వాతావరణం కల్పిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఇప్పుడు అమరావతి వేదికగా చేసిన ప్రకటనలతో.. ఆ దిశగా ప్రభుత్వం తన ప్లాన్ ను స్పీడప్ చేయాలని చూస్తున్నట్లు అర్థమమవుతోంది. ఏదేమైనా ఏపీలో ఎకో సిస్టమ్ అనే భావనతో సినీ ఇండస్ట్రీకి అన్ని వసతులు కల్పించి.. అమరావతిని కొత్త సినీ సెంటర్ గా తీర్చిదిద్దాలన్న సర్కార్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
