Begin typing your search above and press return to search.

130 దేశాలు తిరిగిన అన్వేష్.. ఆపేస్తున్నా అంటూ షాకింగ్ ప్రకటన!

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ.. సుమారుగా 90 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని అత్యధిక ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అన్వేష్.

By:  Madhu Reddy   |   12 Jan 2026 7:29 PM IST
130 దేశాలు తిరిగిన అన్వేష్.. ఆపేస్తున్నా అంటూ షాకింగ్ ప్రకటన!
X

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ.. సుమారుగా 90 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని అత్యధిక ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అన్వేష్. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఈ మధ్యకాలంలో తనకు సంబంధం లేని విషయాల గురించి స్పందిస్తూ.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. గత ఏడాది డిసెంబర్లో శివాజీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్లకు స్పందించి.. ఇరుకున పడ్డ ఈయన.. ఆ తర్వాత ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి గురించి అసభ్యకర పదజాలంతో దూషించారు. దీంతో ఆయన టీమ్ స్పందించి వెంటనే అన్వేష్ ను అరెస్టు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా అన్వేష్ రోజుకొక వీడియో విడుదల చేస్తూ.. ఏకంగా భారతదేశంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండిపడ్డారు.

సగటు తెలుగువాడు వినలేని అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ అన్వేష్ మాట్లాడిన మాటలకు నెటిజన్లు మండిపడడమే కాకుండా అతడిని అన్ ఫాలో చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో సుమారుగా 20 లక్షల మంది ఫాలోవర్స్ ఇతడిని అన్ ఫాలో చేశారు. అలా గత కొంతకాలంగా అనుచిత వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న అన్వేష్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పటివరకు తాను 130 దేశాలు తిరిగానని.. ఇకపై ట్రావెలింగ్ ఆపేస్తున్నాను అని తెలిపారు.

ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ అన్వేష్ పలు కామెంట్లు చేశారు. "నేను ట్రావెలింగ్ మానేస్తున్నాను. ఇప్పటివరకు 130 దేశాలు తిరిగాను. ప్రస్తుతం నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి. ఇకపై మీకోసం కాకుండా నాకోసం నాకు నచ్చిన దేశాలను తిరుగుతాను. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుతాను" అంటూ అన్వేష్ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం అన్వేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే ట్రావెలింగ్ మానేస్తున్నాను అని చెప్పిన ఈయన.. తన ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ లో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఇటీవల వెనిజులాలో తీసిన ఒక వీడియో పై అన్వేష్ పై పోక్సో కేస్ పెట్టాలని నెటిజన్స్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా 14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడని ఈయనపై ఆరోపణలు కూడా వినిపించాయి. దీనిపై స్పందించిన అన్వేష్.. 14 ఏళ్ల యువతి తప్పు దోవ పడుతుంటే ఆమెను రక్షించి , ఆమె తండ్రి ఆరోగ్యానికి ఉపయోగపడే మందులను దగ్గరుండి తీసిచ్చాను. అలాంటి నన్ను కావాలనే దూషిస్తున్నారు. ఇక నన్ను అన్ ఫాలో చేసిన వాళ్లతోనే నా దరిద్రం మొత్తం పోయింది. మీకు కావాలి అంటే వెనిజులా సీరీస్ వీడియో చూడండి అంటూ సంచలన కామెంట్ చేశారు. ఇలా మొత్తానికైతే అన్వేష్ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.