Begin typing your search above and press return to search.

'2026లో వారికి అష్ట దరిద్రాలు'.. యూట్యూబర్ అన్వేష్ శాపం

అదే సమయంలో తాజాగా అన్వేష్ ఓ వీడియోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారి మళ్లీ తీవ్ర దుమారాన్ని రేపాయి.

By:  M Prashanth   |   3 Jan 2026 12:26 PM IST
2026లో వారికి అష్ట దరిద్రాలు.. యూట్యూబర్ అన్వేష్ శాపం
X

తెలుగు యూట్యూబర్ అన్వేష్ కోసం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చర్చ నడుస్తోంది. మహిళల డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ.. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే అతడిపై పోలీసులకు ఫిర్యాదులు అందగా.. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు చర్యలు ప్రారంభించారట.

అదే సమయంలో తాజాగా అన్వేష్ ఓ వీడియోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారి మళ్లీ తీవ్ర దుమారాన్ని రేపాయి. తనను డిస్టర్బ్ చేస్తున్నారని, వారందరికీ ఈ ఏడాదిలో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని శాపం పెట్టాడు. అంతే కాదు.. తన నాలుక మీద మచ్చలు ఉన్నాయని, ఏది అంటే జరుగుతుందని అన్నారు.

తాను ఇప్పటి వరకు ఎవరినీ మోసం చేయలేదని అన్వేష్ తెలిపాడు. ప్రపంచ యాత్రికుడిగా అన్ని దేశాలు తిరగడానికి తనకు పంచభూతాలు సహకరిస్తున్నాయని చెప్పాడు. దేవుడే డబ్బులు ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు. సబ్ స్క్రైబర్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉంటే వీడియోస్ చూస్తారని, లేదంటే చూడరని వ్యాఖ్యానించాడు..

తానెప్పుడూ ఎవరినీ వీడియోస్ చూడమని రిక్వెస్ట్ చేయలేదని అన్నాడు. పోలీస్ కేసు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తామని అన్వేష్ తెలిపాడు. విచారణలో భాగంగా పోలీసులు ఏం అడిగినా.. స్పష్టంగా సమాధానం చెబుతానని అన్నాడు. తానెప్పటికీ భారతీయుడేనని, ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు.

ఇక చిన్నప్పటి నుంచి కూడా తాను వినాయకుడి గురించి, భగవద్గీత గురించి ఎన్నో విషయాలు చెప్పానని అన్నాడు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించాడు. శారీలు కట్టుకున్న 60 వేల మందిపై అత్యాచారం చేశారని తాను అన్నానని.. దాని సీతమ్మ తల్లి కోసం ఏదో అన్నానని వైరల్ చేశారని అన్వేష్ వ్యాఖ్యానించాడు.

అయితే అన్వేష్ కు సబ్ స్క్రైబర్స్ బాగా తగ్గుతున్న విషయం తెలిసిందే. అనుచిత వ్యాఖ్యలు చేశాక పెద్ద ఎత్తున నెటిజన్లు అన్ సబ్స్క్రైబ్ చేశారు. కానీ తాను ఫాలోవర్స్ కావాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. ప్రమోషన్స్ చేసే వాళ్లకు వారు అవసరమని, తనకు మాత్రం కాదు అంటూ ఫాలోవర్స్ ను లైట్ తీసుకుని కామెంట్స్ చేశారు.

జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడంతో అందరూ మండిపడుతుంటే.. తనను మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారని అన్వేష్ అన్నాడు. అంతే కాదు.. ఏకంగా 2026 సంవత్సరంలో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని శాపాలు పెట్టాడు. తనకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని, అలా ఉంటే ఏం అనుకుంటే జరుగుతుందని శపించాడు. ప్రస్తుతం అన్వేష్ కామెంట్స్ వైరల్ గా మారగా.. నెటిజన్లు మళ్లీ అతడిపై ఫైర్ అవుతున్నారు.