తోటి కోడలిపై అనుష్కశర్మ కామెంట్స్..
తాజాగా అనుష్క శర్మ తన తోటి కోడలు చేతన కోహ్లీను ప్రశంసిస్తూ.. ఇంస్టా స్టోరీ పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
By: Madhu Reddy | 22 Oct 2025 1:37 PM ISTటీమిండియా దిగ్గజ క్రికెట్ ఆటగాడు.. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో సత్తా చాటుతూ దూసుకుపోయిన విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం వన్డే మ్యాచ్లో మాత్రమే కొనసాగుతున్నారు. గత ఏడాది టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లకి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపోతే సోషల్ మీడియాలో 25 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈయన.. కుటుంబానికి సంబంధించిన విషయాలు మాత్రం చాలా తక్కువగానే పోస్ట్లు పెడుతుంటారు. అయితే ఆ పోస్ట్ లలో కూడా.. తన భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ ఫోటోలను మాత్రమే షేర్ చేస్తాడు. కానీ ఇప్పటివరకు తన కుమార్తె వామిక.. కుమారుడు అకాయ్ ఫోటోలను ఎప్పుడూ కూడా షేర్ చేయలేదు.
ఇదిలా ఉండగా మరొకవైపు విరాట్ కుటుంబంతో అనుష్క ఎక్కువగా కలవరు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం అసలు ఆమె వారితో కలిసినట్టు ఉన్న ఫోటోలు ఒకటి కూడా లేకపోవడమే. కానీ అటు విరాట కోహ్లీ అక్క భావన కోహ్లీ దింగ్రా.. అన్నయ్య వికాస్ కోహ్లీ భార్య చేతన కోహ్లీ మాత్రం అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ, అతడు పిల్లల గురించి మాత్రం పోస్ట్లు పెడుతూ ఉంటుంది. అనుష్క శర్మ మాత్రం వీరి ఫోటోలను ఎప్పుడూ కూడా పోస్ట్ చేయదు. కేవలం వారి పోస్టులకు లైకులు మాత్రమే కొడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు విరాట్ కోహ్లీ భార్య విరాట్ కుటుంబంతో కలవదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. సడన్గా తన తోటి కోడలిపై ప్రశంసలు కురిపిస్తూ అనుష్క చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా అనుష్క శర్మ తన తోటి కోడలు చేతన కోహ్లీను ప్రశంసిస్తూ.. ఇంస్టా స్టోరీ పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. చేతన కోహ్లీ చీర కట్టులో యోగాసనంలో ఉన్న ఫోటోని అనుష్క షేర్ చేస్తూ.." ప్రతి భంగిమలో కూడా యోగానే ప్రతిబింబిస్తోంది. స్ట్రెంత్, గ్రేస్ అన్నీ తనలో ఉన్నాయి. నిన్ను చూసి గర్విస్తున్నా చేట్స్" అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు కొన్ని ఎమోజీలను పంచుకుంది అనుష్క. దీంతో ఇన్ని రోజులు అనుష్క.. విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో కలవదు అంటూ వచ్చిన వార్తలకు ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ పోస్ట్ కి చేతన్ ను ట్యాగ్ చేయగా.. ఆమె కూడా స్పందిస్తూ .."కృతజ్ఞతలు అనుష్క.. నాలో ఉన్న గ్రేస్ గుర్తించినందుకు ధన్యవాదాలు" అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
