Begin typing your search above and press return to search.

ఈ క్రికెట‌ర్ అనుష్క ఇంటికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చి వెళ్లేవాడు!

ఇటీవ‌ల‌ విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ ముంబైని వ‌దిలి పూర్తిగా లండన్‌లో స్థిర‌ప‌డ్డార‌ని క‌థ‌నాలొచ్చాయి.

By:  Sivaji Kontham   |   22 Aug 2025 3:00 AM IST
ఈ క్రికెట‌ర్ అనుష్క ఇంటికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చి వెళ్లేవాడు!
X

ఇటీవ‌ల‌ విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ ముంబైని వ‌దిలి పూర్తిగా లండన్‌లో స్థిర‌ప‌డ్డార‌ని క‌థ‌నాలొచ్చాయి. అంతర్జాతీయ కృష్ణ స‌మాజం (ఇస్కాన్‌) స‌భ్యులుగా వారు పూర్తిగా ఆధ్యాత్మిక‌త‌కు అంకిత‌మ‌య్యారు. లండ‌న్ ఇస్కాన్ లో కీర్త‌న్స్, భ‌జ‌న్స్ ని అస్స‌లు మిస్ కాకుండా అటెండ‌వుతున్నారు. ఆధ్యాత్మిక‌త‌లోని గొప్ప‌త‌నాన్ని తెలుసుకునేందుకు, స‌నాత‌న హిందూ ధ‌ర్మాన్ని అనుస‌రించేందుకు ఎల్ల‌పుడూ ఈ అంత‌మైన జంట‌ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌ గురువుల‌ను క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలోని అన్ని ఒత్తిళ్ల‌ను వేగంగా వ‌దిలించుకునే ప్ర‌క్రియ‌లో ఉన్నారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

విరుష్క దంప‌తులు లండ‌న్ లో ప్ర‌శాంత‌మైన జీవితాన్ని కోరుకున్నారు. ఇటీవలే అక్క‌డ‌ వీధుల్లోకి వచ్చి అభిమానులతో ముచ్చ‌ట్లు పెట్టిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. విరుష్క పిల్ల‌లు లండ‌న్‌లో వేగంగా ఎదిగేస్తున్నారు. జనవరి 2021లో ఈ దంప‌తులు తమ మొదటి బిడ్డకు స్వాగ‌తం ప‌లికారు. కుమార్తె వామిక వేగంగా ఎదిగేస్తోంది. ఫిబ్రవరి 2024లో అనుష్క- విరాట్ తమ రెండవ సంతానంగా అకాయ్ జన్మించినట్లు ప్రకటించారు.

అయితే విరుష్క జంట పెళ్ల‌యి ఈ ఏడేళ్ల ప్ర‌యాణంలో ఎన్నో ఎన్నెన్నో. అంత‌కంటే ముందు.. ఒక‌సారి వారి బ్యాచిల‌ర్ లైఫ్ లోకి చూస్తే, అప్ప‌ట్లో అనుష్క‌- విరాట్ ప్రేమ‌జంట‌ త‌మ కుటుంబాల‌కు తెలియ‌కుండా ఒక‌రినొక‌రు క‌లుసుకునేవారు. అంతేకాదు..పెళ్లికి ముందు డేటింగ్ లో ఉన్న‌ప్పుడు విరాట్ నేరుగా అనుష్క శ‌ర్మ ఇంటికి వెళ్లేవాడు. ఆ స‌మ‌యంలో కోహ్లీ కార్ ఆ ఇంటి ముందు ఆగ‌గానే చుట్టూ ఉన్న పిల్ల‌లు అత‌డి కార్ చుట్టూ గుమిగూడేవారు. అయితే ఈ ర‌హ‌స్యాన్ని చెప్పిన‌ది ఎవ‌రు? అంటే... అనుష్క శ‌ర్మ ఇంటి పొరుగున ఉండే వివేక్ అగ్నిహోత్రి. ది బెంగాల్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు అగ్నిహోత్రి అనుష్క శ‌ర్మ‌తో ఇరుగు పొరుగు వార‌మ‌ని తెలిపారు. అనుష్క శ‌ర్మ తండ్రి త‌న‌కు మంచి స్నేహితుడు అని కూడా వెల్ల‌డించారు. అయితే కొన్నాళ్ల త‌ర్వాత తాము ఆ కాల‌నీ నుంచి వేరొక చోటికి త‌ర‌లి వెళ్లిపోయామ‌ని తెలిపారు.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో అగ్నిహోత్రి మాట్లాడుతూ-``అనుష్క శర్మ అప్పట్లో నా పొరుగున ఉండేవారు. మేము ఒకే సమాజంలో నివసించాం. కానీ మేం వేరే ప్రాంతానికి వెళ్లాం. కానీ ఆమె తండ్రి ఇప్పటికీ నాకు గొప్ప స్నేహితుడు. అనుష్క‌తో వివాహానికి చాలా కాలం ముందు, విరాట్ ఆమెను కలవడానికి రెగ్యుల‌ర్‌గా ఇంటికి వచ్చేవాడు. మా వీధిలో పిల్లలు పిచ్చిగా ఉండేవారు. వారు అతని కారు వెనుక ప్రేమగా పరిగెత్తేవారు. నాకు అతడి గురించి ఉన్న ఏకైక జ్ఞాపకం అదే. నేను విరాట్ ని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. అలాగే నాకు క్రికెట్ అంటే పెద్దగా ఇష్టం లేదు. ప‌ని ఒత్తిడిలో స‌మ‌యం దొరకదు. నేను ఎప్పుడూ బిజీగా ఉన్నాను`` అని తెలిపారు. అగ్నిహోత్రి తెర‌కెక్కించిన `ది బెంగాల్ ఫైల్స్` విడుద‌ల‌ను స్థానిక అధికార పార్టీ వ్య‌తిరేకిస్తోంది. ఇందులో వివాదాస్పద అంశాలున్నాయ‌ని వాదిస్తున్నారు.