ఒడిశాలో అనుష్క కోసం పోలీసులు లాఠీఛార్జ్!
తెలుగు రాష్ట్రాల్లో స్వీటీ అనుష్క పై అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానించే తార.
By: Srikanth Kontham | 25 Aug 2025 8:24 PM ISTతెలుగు రాష్ట్రాల్లో స్వీటీ అనుష్క పై అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానించే తార. సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి, సౌందర్య తరహాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నటి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోనూ గుర్తింపు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనుష్క ఫిలిం సర్కిల్ దాటి వచ్చిందంటే? సెల్పీలంటూ ఎగబడేది ఎంతోమంది.
ఆమె పక్కన నుంచుకోవాలని..ఓ సెల్పీ దిగాలని ఆశపడే వారెంతో మంది. తాజాగా ఇదే స్థాయి అభిమానం అనుష్క ఒడిశా నుంచి కూడా చూసిందని వెలుగులోకి వచ్చింది. ఈ విషయా న్నిస్వయంగా నిర్మాత రాజీవ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ `ఘాటీ` చిత్రా న్నితెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఒడిశాలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ చాలా బాగం ఒడిశాలోనే జరిగింది. అనుష్కకు సంబంధించిన సన్నివేశాలన్నీ అక్కడే కీలకంగా చిత్రీకరించారు.
చాలా వరకూ షూట్ ఒడిశా కొండగుట్టల్లో షూట్ చేసారు. అయితే షూటింగ్ ఆ ప్రాంతంలో జరుగుతుందని తెలుసుకుని ఒడిసా వాసలు తండోపతండాలు గా తరలి వచ్చారని రాజీవ్ రెడ్డి తెలిపారు.వేలాదిమంది అభిమానులు తరలి రావడంతో ఓ సందర్భంలో భద్రత కారాణాల దృష్ట్యా పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేసారన్నారు. అక్కడ ఇలాంటి ఘటన జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదన్నారు. `ఒడిశాలో అనుష్కకు అభిమానులు ఎవరుంటరాని అనుకున్నాను. కానీ తరలి వచ్చిన జనంతో అనుష్క ఏ స్థాయికి ఎదిగింద న్నది మరోసారి అర్దమైందన్నారు.
అలాగే ఘాటీ రిలీజ్ కి ఇంకా పది రోజులే సమయం ఉంది. ప్రచారంలో అనుష్క కనిపించలేదేంటని ప్రశ్నిస్తే? రాజీవ్ రెడ్డి దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్ పరంగా అనుష్కకు-తమకు ఓ అవగాహన, క్లారిటీ ఉందన్నారు. ప్రచార పరంగా అనుష్క పాత్రని ముందే తమకు చెప్పారన్నారు. ఆమె నిర్ణయాన్ని తాము అంతే గౌరవించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దీంతో ఈసినిమా ప్రమోషన్ లో అనుష్క ఎక్కడా కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
