'కొంతకాలంపాటు దూరం'.. అనుష్క సంచలన నిర్ణయం!
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 12 Sept 2025 5:20 PM ISTస్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని అంతా ఆశించగా.. అనుకున్నట్లు జరగలేదు. తొలి రోజు పర్వలేదనిపించినా ఆ తర్వాత భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశపడ్డారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు అనుష్క పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.
నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నానని అనుష్క రాసుకొచ్చారు. ప్రపంచంతో మళ్లీ కలిసేందుకు కొంతకాలం సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. స్క్రోలింగ్ ను పక్కన పెట్టి ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, త్వరలోనే మరిన్ని కథలతో వస్తానని పేర్కొన్నారు.
మరింత ప్రేమతో మీ ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండని తెలిపారు. ప్రేమతో మీ అనుష్క శెట్టి అంటూ నోట్ షేర్ చేశారు. ఇప్పుడు ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. సడన్ గా ఈ నిర్ణయం ఎందుకోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఏం జరిగింది మేడమ్ అని క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే కొన్నాళ్లుగా అనుష్క బయట ఎక్కడ కనపడడం లేదు. సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడుదలైన ఘాటీ ప్రమోషన్లలో పెద్దగా సందడి చేయలేదు. ఏ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు. ఫ్యాన్ మీట్స్, ఈవెంట్స్, మీడియా ఇంటరాక్షన్స్ కు దూరంగా ఉన్నారు. కేవలం ఫోన్లలో ఇంటర్వ్యూస్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంటున్నారు. బాహుబలి తర్వాత ఆచితూచి స్క్రిప్టులు ఎంచుకుంటున్న అమ్మడు.. ఆ మూవీతో మంచి విజయం సాధించారు. తన యాక్టింగ్ తో కూడా అందరినీ మెప్పించారు.
ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఘాటీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. తన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. కానీ హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఓ మలయాళం సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
