ప్రభాస్ తో మళ్లీ వర్క్ చేస్తారా?.. అనుష్క ఏమందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 2 Sept 2025 3:21 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వారిద్దరూ కలిసి నటించిన బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ చిత్రాలను ఆడియన్స్ తో పాటు అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. మళ్లీ మళ్లీ వారిద్దరూ కలిసి యాక్ట్ చేయాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు.
అయితే ఇప్పుడు అనుష్క ఆ విషయంపై రెస్పాండ్ అయ్యారు. ప్రభాస్ తో మళ్లీ వర్క్ చేసే విషయంపై మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ ఘాటీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో స్పందించిన అనుష్క.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ లో మళ్లీ వర్క్ చేయాలని ఉందని తెలిపారు.
తాను నిజంగా ప్రభాస్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని తెలిపారు. బాహుబలి లాంటి సినిమా తర్వాత అది చాలా ప్రత్యేకంగా ఉండాలని అన్నారు. మంచి స్క్రిప్ట్ వస్తే.. అది ప్రభాస్ కు నచ్చితే తామిద్దరం యాక్ట్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. అనుష్క కోరుకున్న స్క్రిప్ట్ రావాలని అంతా కోరుకుంటున్నారు.
నిజానికి.. బాహుబలి తర్వాత అనుష్క అప్పుడంత సినిమాలు చేయడం లేదు. కథ బాగా నచ్చితేనే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు బాహుబలి స్థాయి కథను ఎవరు రెడీ చేసి ప్రభాస్, అనుష్క ముందుకు తీసుకువస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో.. స్క్రిప్ట్ లభిస్తుందా లేదో చూడాలి.
అదే సమయంలో ఇప్పుడు అనుష్క ఘాటీ మూవీతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఘాటీలో అనుష్క వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులంతా మంచి హోప్స్ పెట్టుకున్నారు. మరి ఘాటీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతలా అలరిస్తుందో వేచి చూడాలి.
