Begin typing your search above and press return to search.

అనుష్క నెక్స్ట్.. అది బెటర్ ఆప్షన్..!

స్వీటీ అనుష్క రీసెంట్ గా ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

By:  Ramesh Boddu   |   5 Oct 2025 11:25 AM IST
అనుష్క నెక్స్ట్.. అది బెటర్ ఆప్షన్..!
X

స్వీటీ అనుష్క రీసెంట్ గా ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కనీసం పమోషన్స్ కూడా సరిగా చేయకపోవడం వల్ల సినిమా డిజాస్టర్ అయ్యింది. సినిమా థియేట్రికల్ వెర్షన్ మాత్రమే కాదు ఓటీటీలో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఐతే అనుష్క ఘాటి స్పెషల్ ఫోన్ టాక్ లో భాగంగా రానాతో నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు గ్యాప్ ఉండదని వరుస సినిమాలు చేస్తానని అన్నది. అనుష్క అలా చెప్పడం ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

నిశ్శబ్ధం తర్వాత అనుష్క గ్యాప్..

ఐతే ఘాటితో మరోసారి ఫిమేల్ సెంట్రిక్ సినిమా అటెంప్ట్ చేసింది అనుష్క. ఇది కూడా అరుంధతి, భాగమతి, రుద్రమదేవి తరహాల్లో ఉంటుందని అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. నిశ్శబ్ధం తర్వాత అనుష్క గ్యాప్ ఇచ్చి మరీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఐతే ఆ తర్వాత ఘాటితో మరో సూపర్ హిట్ కొడుతుందని అనుకుంటే అది కాస్త డిజాస్టర్ అయ్యింది.

అనుష్క నెక్స్ట్ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఇలాంటి ప్రయోగాలు వద్దు కమర్షియల్ సినిమా చేస్తే చాలని అంటున్నారు. స్టార్ సినిమాలకు అనుష్క పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆమె స్టార్స్ తో నటిస్తే ఆ ప్రాజెక్ట్ కి స్పెషల్ క్రేజ్ వస్తుంది. అలా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తా అంటే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఆమెకు ఎంత పాపులారిటీ తెచ్చినా వాటికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందుకే అనుష్క ఇమేజ్ కి తగినట్టుగా స్టార్ సినిమాలు చేస్తే ఆమెకు ప్లస్ అవుతుంది.

సూపర్ సినిమాతో తెరంగేట్రం..

సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క గ్లామర్ షోలో కూడా వెనక్కి తగ్గలేదు. ఇక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కొన్నాళ్లు కనిపించింది. ఐతే ఆ తర్వాత సైజ్ జీరో కోసం బాగా బరువు పెరిగి అది తగ్గించుకోవడం కోసం సినిమాలకు దూరమైంది. కెరీర్ పరంగా అనుష్క ప్లాన్స్ ఏంటన్నది అర్ధం అవ్వక ఆడియన్స్ బాగా అప్సెట్ లో ఉన్నారు.

అనుష్క కూడా మళ్లీ తిరిగి స్టార్ సినిమాలు చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. ప్రస్తుతం అమ్మడు మలయాళంలో ఒక సినిమా చేస్తున్న అనుష్క తెలుగులో కూడా స్టార్ మూవీస్ కోసం ఎదురుచూస్తుంది. ఆమె చేయాలని అనుకోవాలో కానీ స్టార్ సినిమా ఛాన్స్ లు తప్పకుండా వస్తాయి.