Begin typing your search above and press return to search.

రిలీజ్ కు ముందే స్వీటీ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్!

ఎంతో మంది హీరోయిన్లు ఉ న్నా? ఆ పాత్ర‌కు అనుష్క‌ను కావాల‌ని ఎంపిక చేసారు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్ర‌మిది

By:  Srikanth Kontham   |   22 Feb 2026 9:00 PM IST
రిలీజ్ కు ముందే స్వీటీ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్!
X

`ఘాటీ` త‌ర్వాత అనుష్క మ‌ళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుంద‌నుకుంటే ఆ సినిమా వైఫ‌ల్యంతో అమ్మ‌డు సైలెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ప్ర‌క‌టించ‌లేదు. ఆసినిమా రిలీజ్ అనంత‌రం య‌ధావిధిగా సొంతూరు బెంగుళూరుకు వెళ్లిపోయింది. మ‌రి అనుష్క ఇప్పుడేం చేస్తోంది? అంటే `ఘాటీ` స‌మ‌యం లోనే అమ్మ‌డు మాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తేలింది. `క‌థ‌నార్: ది వైల్డ్ సార్స‌ర్` అనే భారీ చిత్రంలో అవ‌కాశం అందుకుంది. జ‌య‌సూర్య‌, మోహ‌న్ లాల్, ప్ర‌భుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించ‌గా, ఫీమేల్ లీడ్ లో అనుష్క క‌నిపించ‌నుంది.

ఎంతో మంది హీరోయిన్లు ఉ న్నా? ఆ పాత్ర‌కు అనుష్క‌ను కావాల‌ని ఎంపిక చేసారు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్ర‌మిది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ గా రోజీని థామ‌స్ తెరకెక్కిస్తున్నారు. అనుష్క‌కు మాలీవుడ్ లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమా కోసం అమ్మ‌డు ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేసింది. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అనుష్క మ‌రో ఛాన్స్ అందుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `మంజుమ్మ‌ల్ బోయ్స్` ద‌ర్శ‌కుడు షైజు ఖ‌లీద్ అమ్మ‌డిని ఓ సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తోంది.

ఇదొక యూత్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తోంది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతూనే యూత్ పుల్ కాన్సెప్ట్ ను హైలైట్ చేస్తుంద‌ని తెలుస్తోంది. క‌థ‌నార్ రిలీజ్ కు ముదే అనుష్క‌కు రెండ‌వ సినిమా అవ‌కాశం రావ‌డం విశేషం. మొత్తానికి తెలుగు, త‌మిళ సినిమాల‌కు దూర‌మైనా మాలీవుడ్ లో మాత్రం క‌నెక్ట్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక అనుష్క అరంగేట్రం చేయాల్సిన ప‌రిశ్ర‌మ‌లు రెండు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. అవే క‌న్న‌డ లో ఇంకా లాంచ్ అవ్వ‌లేదు. అక్క‌డ ప్ర‌య‌త్నాలు కూడా చేసినట్లు లేదు.

అలాగే బాలీవుడ్ లో కూడా అనుష్క ఎంట‌ర్ అవ్వాల‌ని అభిమానులు ఆశీస్తున్నారు. అనుష్క క‌టౌట్ కి అక్క‌డ మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ప్రోత్స‌హిస్తున్నారు. వాస్త‌వానికి చాలా కాలంగా హిందీ సినిమాలు చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌పోజ‌ల్ ఉంది. కానీ అనుష్క బాలీవుడ్ ని లైట్ తీసుకుంది. అక్క‌డ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసింది లేదు. ఇప్ప‌టికే అనుష్క వ‌య‌సు 44 ఏళ్లు. ఇంకా వివాహం చేసుకోలేదు. వ‌య‌సు మీద ప‌డుతున్నా? అమ్మ‌డు వివాహానికి దూరంగా ఉండ‌టంతో పెళ్లి చేసుకోదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.