ఘాటీలో అనుష్కను అందుకే తీసుకున్నాను- క్రిష్
ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
By: Madhu Reddy | 1 Sept 2025 12:22 AM ISTలేడీ ఓరియంటెడ్ మూవీస్ అనగానే ఇప్పటి జనరేషన్ సినీ ప్రేక్షకులకు అనుష్క శెట్టి మాత్రమే గుర్తుకొస్తుంది. అయితే అలాంటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ ఘాటీ.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఘాటీ మూవీలో విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుండడంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచేసారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఘాటీ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనదు అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. దాంతో డైరెక్టర్,మిగిలిన ఆర్టిస్టులు అందరూ సినిమా ప్రమోషన్స్ ని తమ భుజాన వేసుకున్నారు.
శీలావతి పాత్రకు ఆమె మాత్రమే పర్ఫెక్ట్ - క్రిష్
ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఘాటీ సినిమా అనుకున్నప్పుడు నా మైండ్ లోకి మొదటగా వచ్చింది అనుష్క మాత్రమే. ఇలాంటి పాత్రని అనుష్క మాత్రమే సక్సెస్ఫుల్ గా పోషించగలరని అనుకున్నాను. అందుకే శీలావతి అనే పవర్ఫుల్ పాత్రకి అనుష్కను తీసుకున్నాను. నా సినిమా కోసం అనుష్కని మొదటిసారి అడగగానే ఓకే చేసింది. ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతుంది అనే వార్తలకు కూడా ఈ సినిమాతో చెక్ పెట్టింది. అలాగే CBI ఆఫీసర్ పాత్రకి జగపతిబాబు కరెక్ట్ గా సెట్ అవుతారని, ఆయన్ని మాత్రమే తీసుకున్నాను.
ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోలేను - క్రిష్
దేశీరాజు పాత్ర కోసం విక్రమ్ ప్రభు ని తీసుకోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఘాటీలో దేశీరాజు కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపిస్తుంది. అందులో విక్రమ్ ప్రభునే ఊహించుకోగలిగాను.అందుకే ఆయన్ని తీసుకోవడానికి అస్సలు వెనుకడుగు వేయలేదు. అలాగే ఘాటి మూవీలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రాణం పెట్టి నటించారు. ఇందులో అనుష్క నట విశ్వరూపం ఏ లెవెల్ లో ఉంటుందో మీరే చూస్తారు.ఈ సినిమా కథ ఎలా ఉంటుంది అంటే ఓ అగ్నిపర్వతం బద్దలయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టేశారు - క్రిష్
ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రాణం పెట్టి పని చేశారు. సెప్టెంబర్ 5న ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడానికి నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను" అంటూ క్రిష్ జాగర్లమూడి తన ఘాటీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక చాలా రోజుల తర్వాత భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో అనుష్క శెట్టి మన ముందుకు రాబోతోంది. అలా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి.. కానీ అనుష్క కూడా ప్రమోషన్స్ కి వస్తే ఇంకా బాగుండేది అని అభిమానులు భావిస్తున్నారు.
