Begin typing your search above and press return to search.

ఘాటీ రిలీజ్ గ్లింప్స్.. అనుష్క పవర్ఫుల్ యాక్షన్!

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.

By:  M Prashanth   |   4 Sept 2025 12:21 PM IST
ఘాటీ రిలీజ్ గ్లింప్స్.. అనుష్క పవర్ఫుల్ యాక్షన్!
X

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరక్కించారు. బాధితుడు, క్రిమినల్, లెజెండ్ అనేది సినమా క్యాప్షన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 05న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక రోజు ముందు సినిమాకు సంబంధించిన రిలీజ్ గ్లింప్స్ పేరుతో మరో వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియో 1.21 నిమిషాల నిడివితో ఉంది. ఈ సినిమా విడుదల గ్లింప్స్ ను రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్ హై యాక్షన్, హై విజువల్స్.. గ్రాండ్ బీజీఎమ్ తో వీడియో గ్లింప్స్ పవర్ఫుల్ గా ఉంది. ఇందులో అనుష్క నెక్ట్స్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ చూపించారు. వాళ్లు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు, అంటే నేను ఊరుకోను.. అని అనుష్క గ్లింప్స్ చివర్లో చెప్పిన డైలాగ్ వేరే లెవెల్ లో ఉంది.

ఈ గ్లింప్స్ లో అనుష్క విశ్వరూపం చూపించారు. ఆధ్యంతం ఆసక్తిగా సాగుతున్న గ్లింప్స్ లో మొత్తం అనుష్క యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇవి సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కాగా ఇది పూర్తి కల్పితమైన కథ. పాత్రలు కూడా ఫిక్షనలే. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా సరిహద్దు గ్రామాల దగ్గర శిలావతి అనే గంజాయి రకం సహజంగా పెరుగుతుంది.

ఆ గంజాయిను తీసుకొచ్చందుకు కొంత మంది కూలీలు ఉంటారు. వాళ్లనే ఘాటీలు అని పిలుస్తుంటారు. అయితే గంజాయి అనేది సమాజానికి పెద్ద సమస్య. ప్రభుత్వం గంజాయిని అరికట్టాలని చూసినప్పటికీ.. అవన్నీ దాటుకుని అది వేర్వేరు దారుల్లో సమాజంలోకి వస్తుంది. ఈ సమస్య, గంజాయి నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఒక బాధితుడు నేరస్థుడిగా ఎలా మారాడనేది సినిమా కథ.

అయితే ఈ సినిమాపై ఇప్పటికే హైప్ బాగా ఉంది. అలాగే అనుష్క నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత సినిమా రానుండడంతో ఫ్యాన్స్ లోనూ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలు అనుష్క అరుంధతి సినిమా రేంజ్ లో నటన ఉంటుందని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. ఈ సినిమాలో ఆమె శీలావతి పాత్రలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అలరించనుందని అన్నారు. ఇందులో ఆమె పాత్రకు గ్రేస్‌ అండ్ ఆటిట్యూడ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని క్రిష్ అన్నారు.

కాగా, ఈ సినిమాలో అనుష్కతో పాటు, విక్రమ్ ప్రభు, సీనియర్ నటుడు జగపతి బాబు, చైతన్య రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్‌ - UV క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.