ఘాటీతో క్రిష్ సొసైటీని మార్చేస్తాడా?
టాలీవుడ్ క్వీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా మూవీ ఘాటీ.
By: Sravani Lakshmi Srungarapu | 3 Sept 2025 12:00 PM ISTటాలీవుడ్ క్వీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా మూవీ ఘాటీ. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఘాటీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వీటీ రాకపోవడంతో భారమంతా టీమ్ మీదే
లీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అనుష్క ప్రమోషన్స్ కు రాకపోవడంతో ఆ భారమంతా దర్శకనిర్మాతలు, ఇతర క్యాస్ట్ పై పడటంతో అందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న డైరెక్టర్ క్రిష్ ఘాటీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ సినిమాను వార్తల్లో నిలుపుతున్నారు.
గంజాయి స్మగ్లింగ్ పై ఘాటీ
సమాజం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్యను ఘాటీలో చూపించామని, గంజాయి స్మగ్లింగ్ ఇప్పుడు స్కూల్స్ కు కూడా చేరుకుందని, ఈ గంజాయి స్మగ్లింగ్ రవాణా చాలా పెద్దదని, ఈ సబ్జెక్టును హీరో యాంగిల్ నుంచి కాకుండా హీరోయిన్ యాంగిల్ నుంచి చూపిస్తే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందనిపించిందని, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానో సినిమా చూశాక ప్రతీ ఒక్కరికీ అర్థమవుతుందని డైరెక్టర్ క్రిష్ చెప్పారు.
సరోజ క్యారెక్టర్ ను కంటిన్యూ చేద్దామనుకున్నా
ఘాటీ స్టోరీ లైన్ మైండ్ లో పుట్టినప్పటినుంచి దాన్ని అనుష్క తోనే చేయాలనుకున్నానని, వేదం తర్వాత మరో సినిమా చేయాలని ఇద్దరం అనుకున్నామనీ, వేదంలోని సరోజ క్యారెక్టర్ ను కంటిన్యూ చేయాలని కూడా అనుకున్నాననీ కానీ స్టోరీ ఆర్గానిక్ గా ఉండాలని వెయిట్ చేశానని, ఆ టైమ్ లోనే ఘాటీ ఆలోచన వచ్చిందని, సినిమాలో శీలావతి క్యారెక్టర్ కు అనుష్క యాటిట్యూడ్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సూటయ్యాయని క్రిష్ చెప్పారు.
