ఘాటీ సెన్సార్ టాక్ - ఇంటర్వెల్ తర్వాత ఊచకోతేనట!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Aug 2025 10:10 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన అందం, నటనతో విపరీతమైన ఫ్యాన్స్ ను సంపాదించుకున్న అనుష్క.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత మరో సినిమా చేసింది లేదు. ఆ సినిమా రిలీజైన చాలా రోజులకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమైడి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకుని దాన్ని రిలీజ్ కు రెడీ చేశారు.
గతంలో ఇదే కాంబినేషన్ లో వేదం
అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో గతంలో వేదం సినిమా రాగా ఆ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించారు. వేశ్య పాత్ర అయినప్పటికీ ఆ క్యారెక్టర్ లో ఎలాంటి వల్గారిటీ లేకుండా క్రిష్ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు ప్రశంసలందుకుంది. అలాంటి వీరిద్దరి కలయికలో ఇప్పుడు ఘాటీ సినిమా రాబోతుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘాటీ సెన్సార్ పూర్తి..
రిలీజ్ కు మరో 6 రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 37 నిమిషాల నిడివి కలిగిన ఘాటీ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్ ను ప్రశంసించిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలోమొత్తం మీద ఏడెనిమిది పెద్ద యాక్షన్ సీన్లు ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కథ ఎమోషనల్ జర్నీగా సాగుతుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి అందరూ షాకవడం గ్యారెంటీ అని, ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మొత్తం డిఫరెంట్ గా ఉండనుందని సమాచారం. అప్పటివరకు ఎమోషనల్ గా ఉండే కథ ఒక్కసారిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్లి ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుందని చెప్తున్నాయి. గంజాయి మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో అనుష్క మరో హిట్ కొట్టడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
