అనుష్క 'ఘాటి' సెన్సార్ రిపోర్ట్!
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఘాటి. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాలని భావించారు.
By: Ramesh Palla | 28 Aug 2025 11:17 AM ISTమిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఘాటి. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, సినిమా విడుదల తేదీ మార్చేది లేదు అన్నట్లుగా మేకర్స్ ప్రమోషన్స్ హడావుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. అనుష్కను చాలా విభిన్నంగా దర్శకుడు క్రిష్ చూపిస్తున్న నేపథ్యంలో ఘాటి సినిమా కోసం ఆమె అభిమానులు మాత్రమే కాకుండా, సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.
ఘాటి సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్
క్రిష్ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను వదిలేసుకున్న విషయం తెల్సిందే. అనుష్కతో ఘాటి సినిమాను చేసిన క్రిష్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఆయన ప్రతి సినిమా దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఎప్పటిలాగే చాలా భిన్నంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించారు. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ జారీ అయింది. సినిమా పట్ల సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, అంతే కాకుండా దర్శకుడు క్రిష్, హీరోయిన్ అనుష్కలను అభిమానించే వారు గర్వించే విధంగా ఈ సినిమా ఉందని వారు అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
క్రిష్ దర్శకత్వంలో అనుష్క
ఘాటి సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో సీక్రెట్‌గా ఉంచిన క్రిష్ విడుదల సమయంకు హడావిడి చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడం లేదు. హిట్ పడి చాలా వారాలు అయింది. అందుకే ఈ సినిమా కోసం బాక్సాఫీస్ వర్గాల వారు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మినిమం హిట్ పడి, బాక్సాఫీస్ వద్ద కాసులు గలగల అని ఎన్నో వారాలు అయింది, ఘాటి అయినా ఆ లోటును భర్తీ చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనుష్క సినిమాలు పెద్దగా ఆడలేదు. పైగా ఆమె సినిమాలను చాలా తగ్గించింది. అయినా కూడా అభిమానులు మాత్రం ఆమెను అభిమానిస్తూనే ఉన్నారు, ఆమె సినిమాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పైగా ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
విక్రమ్ ప్రభు, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో
సెన్సార్ క్లియరెన్స్ రావడంతో సినిమా విడుదల విషయంలో మరింత స్పష్టత వచ్చింది. 2 గంటల 35 నిమిషాల నిడివితో రాబోతున్న ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఇంకా ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు ముద్దాడి, జగపతిబాబు, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతాన్ని అందించారు. యెదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఘాటి సినిమాను నిర్మించారు. అనుష్క చాలా కాలం తర్వాత యూవీ క్రియేషన్స్ కాకుండా బయట బ్యానర్‌లో నటించింది. అనుష్క యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించింది అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. అనుష్క ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఫుల్ మీల్స్ ఘాటితో అయినా లభించేనా చూడాలి.
