Begin typing your search above and press return to search.

అనుష్క ఘాటి.. ఊహించినట్టుగానే..?

స్వీటీ అనుష్క సినిమాల విషయంలో క్లారిటీ లేదు. నిశ్శబ్ధం తర్వాత దాదాపు నాలుగేళ్ల దాకా సైలెంట్ గా ఉన్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సర్ ప్రైజ్ చేసింది.

By:  Ramesh Boddu   |   30 July 2025 5:00 PM IST
అనుష్క ఘాటి.. ఊహించినట్టుగానే..?
X

స్వీటీ అనుష్క సినిమాల విషయంలో క్లారిటీ లేదు. నిశ్శబ్ధం తర్వాత దాదాపు నాలుగేళ్ల దాకా సైలెంట్ గా ఉన్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సర్ ప్రైజ్ చేసింది. పోనీ ఆ సినిమా తర్వాత అయినా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది అనుకుంటే క్రిష్ తో ఘాటి ని మాత్రమే చేస్తుంది. అనుష్క కెరీర్ దూకుడు పెంచాలని అనుకోవట్లేదు. అనుష్క ఘాటి కూడా అలానే రిలీజ్ విషయంలో క్లారిటీ రావట్లేదు.

అనుష్క ఘాటి సెప్టెంబర్ కూడా మిస్..

యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న అనుష్క ఘాటి సినిమా అసలైతే ఈ ఇయర్ ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాక సినిమా వాయిదా వేశారు. ఈమధ్య సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ సమాచారం మేరకు అనుష్క ఘాటి సెప్టెంబర్ కూడా మిస్ అవుతుందని అంటున్నారు.

సెప్టెంబర్ కాదు అక్టోబర్ కూడా ఆగి నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ మొదటి వారం తప్పితే వరుసగా స్టార్ సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. దసరా నుంచి దీపావలి అంటే అక్టోబర్ నెల చివర వరకు వరుస సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏ సినిమాతో కూడా పోటీ పడే ఛాన్స్ లేదు. అందుకే అనుష్క ఘాటి నవంబర్, డిసెంబర్ రిలీజ్ అంటున్నారు.

అనుష్క మరోసారి సత్తా చాటాలని..

మరి ఆ టైం లో అయినా రిలీజ్ అవుతుందా ఈ ఇయర్ ముహుర్తం బాగాలేదు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటారా అన్నది చూడాలి. అనుష్క ఘాటి సినిమా ఎప్పుడొస్తుంది.. ఎప్పుడు చూసేద్దామా అని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ వయిదాలు పడుతూనే ఉంది. అనుష్క ఘాటి సినిమాలో విక్రం పభు, జగపతి బాబు నటిస్తున్నారు. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ ఆ తర్వాత వచ్చిన సాంగ్ ఇంప్రెస్ చేశాయి.

ఘాటితో అనుష్క మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. సినిమాలో ఆమె చాలా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా స్వీటీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందని అంటున్నారు. అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఘాటితో మళ్లీ అనుష్క కంబ్యాక్ ఇస్తే ఇక మీదట ఆమె వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు.