నయనతారలా స్వీటీ మారిపోతుందా?
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచారానికి హాజరు కాదన్న సంగతి తెలిసిందే. సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేయడం వరకే.
By: Srikanth Kontham | 28 Aug 2025 8:00 PM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచారానికి హాజరు కాదన్న సంగతి తెలిసిందే. సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేయడం వరకే. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనదు. కనీసం సోషల్ మీడియాలో కూడా తాను నటించిన సినిమా గురించి ట్వీట్ కూడా వేయదు. ప్రచారం కోసం అదనంగా పారితోషికం చెల్లిస్తామన్నా? అందుకు అంగీకరించదు. ఎన్నికోట్లు ఇచ్చినా ప్రచారానికి మాత్రం నో చెబుతుంది. అది ఎంత పెద్దస్టార్ సినిమా అయినా..ఎన్ని కోట్ల బడ్జెట్ చిత్రమైనా సరే నయన్ నుంచి నో అనే సమాధానం వస్తుంది.
స్వీటీపై కొత్త ప్రచారం:
మరి ఇదే రూట్ లో స్వీట్ అనుష్క కూడా ప్రయాణం మొదలు పెడుతోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో `ఘాటీ` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ కి ఇంకా పది రోజులే సమయం ఉంది. కానీ ఈ సినిమా ప్రచారంలో అనుష్క ఎక్కడా కనిపించలేదు. నిర్మాతలు....ఇతర నటీనటులు ప్రచారం చేసు కోవడం తప్ప స్వీటీ అడ్రస్ మాత్రం లేదు. ఎందుకిలా అంటే? అదంతా తన వ్యక్తిగత ఇష్టంగానే నిర్మాత చెప్పుకొచ్చారు.
ఇకపై ఇదే రూల్:
ప్రచార పరంగా తనను ఎంత మాత్రం ఇబ్బంది పెట్టలేదని..ప్రచారానికి రాను అన్న విషయాన్ని అనుష్క తమకు ముందే చెప్పిందని తెలిపారు. అందుకు అంగీకరించే తాము సినిమా చేసినట్లు నిర్మాత మాటల్ని బట్టి క్లారిటీ వస్తుంది. సాధారణంగా అనుష్క ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమా ప్రచారంలో ముందుం టంది. అందులోనూ క్రిష్ సినిమా అంటే ఇంకా చనువుగా మూవ్ అవుతుంది. కానీ 'ఘాటీ' విషయంలో మాత్రం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తుంది. మరి ఈ గ్యాప్ అన్నది `ఘాటీ` కోసమేనా? లేక ప్రతీ సినిమా విషయంలో ఇదే రూల్ వర్తిస్తుందా? అన్నది స్వీటీ నుంచి క్లారిటీ రావాలి.
క్లారిటీ వచ్చేదెప్పుడు?
'ఘాటీ' ప్రచారం లో అనుష్క కనిపించకపోయే సరికి ఈమె కూడా నయన తారలా నిర్ణయాలు తీసుకుంటుందా? అంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇం కొంత మంది వ్యక్తిగత కారణాలుగా ప్రచారానికి హాజరు కాలేదని...కేవలం ఈ సినిమా ప్రచారానికే దూరంగా ఉంటుందని అంటున్నారు. మరి ఏది నిజం? ఎవరు నిజం అన్నది? స్వీటీ బయటకు వస్తే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం అనుష్క ఘాటీతో పాటు, మాలీవుడ్ లో కూడా ఓ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
