Begin typing your search above and press return to search.

అనుష్కతో సినిమా.. కండీషన్స్ అప్లై..!

ఐతే నెక్స్ట్ ఇప్పుడు ఘాటితో రాబోతుంది అమ్మడు. అనుష్క లీడ్ రోల్ లో క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మించారు.

By:  Ramesh Boddu   |   27 Aug 2025 11:45 AM IST
అనుష్కతో సినిమా.. కండీషన్స్ అప్లై..!
X

స్వీటీ అనుష్క తో సినిమా అంటే చాలు మేకర్స్ అంతా కూడా రెడీ అనేస్తారు. ఆమె స్టార్ డం.. ఆమె బాక్సాఫీస్ కెపాసిటీ తెలుసు కాబట్టే ఆమెతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంటారు. ఐతే ఆమె లుక్స్ వైజ్ కాస్త డిఫరెన్స్ రావడంతో అనుష్క ఈమధ్య సరిగా సినిమాలు చేయట్లేదు. చివరగా నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఐతే నెక్స్ట్ ఇప్పుడు ఘాటితో రాబోతుంది అమ్మడు. అనుష్క లీడ్ రోల్ లో క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మించారు.

ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క..

సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ మరో వారం మాత్రమే ఉంది అయినా కూడా ప్రమోషన్స్ లో ఎక్కడ అనుష్క కనిపించట్లేదు. అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం వెనక రీజన్స్ పై ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం అనుష్క సినిమా సైన్ చేసే ముందే ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ లాంటివి ఇవ్వనని చెప్పిందని అంటున్నారు. ఈమధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా.. ఎంత చిన్న సినిమా అయినా కూడా ప్రమోషన్స్ లేనిదే జనాలు పట్టించుకోవట్లేదు.

అలాంటి టైం లో ప్రమోషన్స్ చేయనంటే కష్టమే. ఐతే నిర్మాతలు మాత్రం అనుష్క కండీషన్స్ మాకు ఓకే అనేస్తున్నారు. అలా ఎందుకంటే ఆమె ప్రమోషన్స్ చేయాలనుకోకపోవడం తన ఒపీనియన్. ఐతే ఇది ముందే చెప్పేస్తుంది కాబట్టి ప్రమోషన్స్ ఎలా ఉన్నా సినిమా మాట్లాడుతుందని అన్నారు. ఇంటర్వ్యూస్ ఏమో కానీ ఘాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుష్క వచ్చే ఛాన్స్ లేదట.అనుష్క కూడా ప్రమోషన్స్ కు రాకపోవడం వెనక బలమైన రీజన్ ఏదై ఉంటుందా అన్నది మాత్రం తెలియట్లేదు.

ఎలాంటి పాత్రలైనా ఛాలెంజింగ్ గా..

సినిమా విషయంలో అనుష్క ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటుంది. ఎలాంటి పాత్రలైనా ఛాలెంజిన్ గా చేస్తుంది. కానీ అనుష్క ప్రమోషన్స్ అంటే మాత్రం సైడ్ అవుతుంది. దీని వెనక బలమైన రీజన్సే ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనా అనుష్క ఫ్యూచర్ సినిమాలకైనా ప్రమోషన్స్ కి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అనుష్క ఘాటి సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా మీద డైరెక్టర్ క్రిష్ మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ మాత్రమే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుష్క ఆల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మరి సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ కి రాకుండా అనుష్క ఎన్నాళ్లు ఇలా చేస్తుందో చూడాలి.