అనుష్క బయటకొచ్చేది డిసెంబర్లోనా!
ఈ అంశంపై సోషల్ మీడియా సహా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనుష్క మీడియా కంట పడకుండా తప్పించుకుని తిరుగుతందా?
By: Srikanth Kontham | 20 Sept 2025 7:00 AM IST`ఘాటీ` సినిమా చేసినా? ఆ సినిమా ప్రచారంలో అనుష్క పాల్గొనలేదు. అందుకు కారణాలేంటి? అంటే రకరకాలు తెరపైకి వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం అనుష్కతో ముందే ప్రచార పరంగా పాల్గొనదు అనే విషయాన్ని తను ముందే చెప్పిందని...ఆ విషయంలో తనకు అన్ని రకాలుగా సహకరించినట్లు తెలిపారు. కానీ ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేసి అనుష్క ప్రచారంలో పాల్గొనలేదు? ఏంటి? అన్న దానిపై ఎవరి సందేహాలు వారివి. సహజంగా ఓ పెద్ద నటి ప్రచారంలో పాల్గొనకపోతే పాజిటివిటీ కంటే నెగివిటీనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆ చిత్రం:
ఈ అంశంపై సోషల్ మీడియా సహా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనుష్క మీడియా కంట పడకుండా తప్పించుకుని తిరుగుతందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా గతం. మరి స్వీటీ మళ్లీ బయటకు వచ్చేది ఎప్పుడు? అంటే డిసెంబర్ లో అందుకు అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో `కథనార్` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింద.ఇ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ తేదీ ఇంకా వెల్లడించలేదు.
మాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తుందా:
ఇదే ఏడాది రిలీజ్ అవుతుందా? వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా? అన్న దానిపై సందేహాలున్నాయి. కానీ మాలీవుడ్ మీడియాలో డిసెంబర్లో రిలీజ్ ఉంటుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రచారంలో అనుష్క భాగమవుతుందా? `ఘాటీ` తరహాలో స్కిప్ కొడుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు. కానీ మాలీవుడ్ లో అనుష్క తప్పక బయటకు రావాల్సిన సమయం ఇది. `కథనార్` అనుష్క మాలీవుడ్ డెబ్యూ. పైగా పాన్ ఇండియా రిలీజ్క. ఆరంభ చిత్రం ప్రచారంలోనే అనుష్క మీడియా కంట పడలేదంటే? అక్కడా నెగిటివిటీ తప్పదు.
అక్కడ అనుష్క నిర్ణయం ఎలా:
హీరోయిన్ లేని ప్రచారాన్ని మాలీవుడ్ ప్రేక్షకులు అంగీకరించరు. పరిశ్రమ పరంగానూ మాలీవుడ్ చిన్నది. తమిళ, తెలుగు భాషల్లోనూ మార్కెట్ చేయాలంటే? అనుష్క ప్రచారం చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుంది. ఇందులో హీరోగా నటిస్తోంది జయసూర్య. అతడి మాలీవుడ్ వరకే పరిమితం. ప్రభుదేవా మరో హీరోగా నటిస్తున్నా? స్టార్ హీరో కాదు. ఈ రెండు కోణాల్లో చూస్తే అనుష్క ప్రచారం సినిమాకు కోట్ల రూపాయల పబ్లిసిటీని అందించినట్లే. మాలీవుడ్ లోనూ తనను తాను వ్యక్తిగతంగా ప్రమెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మేకర్స్ అనుష్క విషయంలో ఎలా ముందుకెళ్తారు? అన్నది చూడాలి.
