Begin typing your search above and press return to search.

అనుష్క 'ఘాటీ' బాక్సాఫీస్.. ఇలా జరిగిందేంటి?

సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 Sept 2025 1:01 PM IST
అనుష్క ఘాటీ బాక్సాఫీస్.. ఇలా జరిగిందేంటి?
X

సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రలో నటించారు. జగపతి బాబు, చైతన్య రావు తదితరులు మూవీలో కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ రూపొందించింది.

అయితే రిలీజ్ కు ముందు ఘాటీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, రిలీజ్ గ్లింప్స్ వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. చాలా మంది విశ్లేషకులు మాత్రం అనుష్క శెట్టి పోషించిన రోల్ తో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ను ప్రశంసించారు.

కానీ కథనాన్ని మాత్రం విమర్శించారు. ఇంకాస్త కష్టపడాల్సిందని రివ్యూస్ ఇచ్చారు. ఏదేమైనా సినిమాలో ఎవరు ఉన్నా.. కంటెంట్, మౌత్ టాక్, రెస్పాన్స్ కీలకమని మరోసారి ఘాటీ ప్రూవ్ చేసింది. అదే సమయంలో మూవీ బాక్సాఫీస్ విషయానికొస్తే.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. అంచనాలకు తగ్గట్టు అసలు వసూలు చేయడం లేదు.

రిలీజ్ కు ముందు అంచనాలు చూసి.. సినిమా మొదటి రోజు రూ.ఐదు కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ ఫస్ట్ డే రెండు కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది. రెండో రోజు తగ్గి కోటిన్నర కలెక్ట్ చేసింది. మూడో రోజు ఇంకాస్త తగ్గి కోటి కంటే కాస్త ఎక్కువ రాబట్టింది. రూ.1.15 కోట్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది.

అయితే థియేటర్లలో విడుదలైన మూడు రోజుల్లో ఘాటీ సినిమా.. రూ.4.89 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం. దీంతో ఓపెనింగ్స్ రూ.5 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా, మూడు రోజులు కలిపి కూడా రూ.5 కోట్ల కన్నా తక్కువే వచ్చాయి. అలా.. ఘాటీ మూవీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకు చాలా కష్టపడుతుందనే చెప్పాలి.

అదే సమయంలో ఫుల్ రన్ లో ఘాటీ మూవీ రూ.10 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందో లేదో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ లో రూ.5 కోట్ల మార్క్ ను కూడా చేరుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఘాటీ మూవీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. మరి ఫుల్ రన్ లో ఘాటీ మూవీ ఏం చేస్తుందో.. ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.