Begin typing your search above and press return to search.

అనుష్క.. యోగా టీచర్ ఇంకా ఇబ్బంది పడుతోందా?

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి స్టార్ హీరోలతో సమానంగా స్టార్‌ డమ్‌ ను సంపాదించింది.

By:  M Prashanth   |   8 Aug 2025 9:27 AM IST
అనుష్క.. యోగా టీచర్ ఇంకా ఇబ్బంది పడుతోందా?
X

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి స్టార్ హీరోలతో సమానంగా స్టార్‌ డమ్‌ ను సంపాదించింది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో అనేక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె అరుంధతి లాంటి సినిమాలో నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే ఇటీవల కాలంలో ఆమె నుంచి యాక్షన్‌ సినిమాలు రాలేదు. కానీ, తాజా సినిమా ఘాటీతో మళ్లీ యాక్షన్ పాత్రలో కనిపించి కనువిందు చేయనుంది.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజైంది. ఇందులో ఆమె లుక్స్ బాగా వైలెంట్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లుక్స్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. లావైపోయినట్లు కనిపిస్తుందని ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అనుష్క ఒకప్పుడు యోగా టీచర్. అలాంటి ఆమె శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడంలో కష్టపడుతుందని అంటున్నారు.

కెరీర్ లో తొలుత యోగా టీచరైన అనుష్క.. సినీ కెరీర్‌ లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి పనిచేసింది. అరుంధతి, బాహుబలి సినిమాల్లో ఆమె పాత్రలు హీరోయిన్ గా ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక వేదంలో ఆమె పోషించిన పాత్రకైతే విమర్శకుల నుంచి సైతం అనుష్క ప్రశంసలు అందుకుంది.

కానీ అనూహ్యంగా సైజ్ జీరో సినిమా ఒప్పుకోవడం ఆమె కెరీర్ గతిని పూర్తిగా మార్చివేసింది. ఈ సినిమా కోసం అనుష్క సహజంగానే చాలా బరువు పెరిగింది. మళ్లీ తగ్గించడానికి ఎంతో కష్టపడింది. కఠినమైన ఫిట్‌నెస్ మెయింటెన్ చేసినప్పటికీ, ఆమె ముందటి సైజ్ కు తిరిగి రావడం కష్టంగా మారింది. అయితే సినిమా కోసం బరువు పెరగడం ప్రశంసించదగినదే.. కానీ, ఆ తర్వాత యాథవిధిగా మాత్రం మారడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

బాహుబలి సినిమాల తర్వాత అనుష్క.. భాగమతి, మిస్ శెట్టి- మిస్టర్ పాలిషెట్టి చిత్రాలలో నటించింది. రెండు చిత్రాలలోనూ, అనుష్కను క్లోజ్ షాట్లలో స్లిమ్‌ గా చూపించడానికి నిర్మాతలు గ్రాఫిక్స్ ను ఉపయోగించారని తెలిసింది. అప్పట్లో దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అనుష్క బయటి ఈవెంట్లకు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని టాక్. ఇటీవల బాహుబలి 10ఏళ్ల సెలబ్రేషన్స్ కు కూడా ఆమె బహిరంగంగా కనిపించలేదు.

తాజాగా ఘాటి ట్రైలర్‌లో, అనుష్క కు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆమెను సన్నగా చూపించడానికి సీజీని ఉపయోగించినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు కాస్త, నిరాశ చెందారు. మరి సినిమా విడుదలైయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో మున్ముందు చూడాలి!