Begin typing your search above and press return to search.

అనుష్క ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డుతుందా?

మొద‌టి నుంచే అనుష్క‌కు ఇండ‌స్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఆమె క్రేజ్, స్టార్ స్టేట‌స్ ను చూసే మేక‌ర్స్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Sept 2025 4:00 PM IST
అనుష్క ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డుతుందా?
X

సౌత్ సినిమాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒక‌రు. అలాంటి అనుష్క నుంచి తాజాగా వ‌చ్చిన సినిమా ఘాటీ. ఫ‌స్ట్ షో నుంచే ఈ సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఘాటీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. దానికి తోడు ప్ర‌మోష‌న్స్ కూడా గ‌ట్టిగా చేయ‌క‌పోవ‌డంతో ఈ సినిమాకు స‌రైన ఓపెనింగ్స్ కూడా ద‌క్క‌లేదు.

ఘాటీకి నెగిటివ్ రెస్పాన్స్

మొద‌టి నుంచే అనుష్క‌కు ఇండ‌స్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఆమె క్రేజ్, స్టార్ స్టేట‌స్ ను చూసే మేక‌ర్స్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తారు. ఆమె కూడా అదే న‌మ్మ‌కంతో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ వ‌స్తున్నారు. కానీ ఘాటీ సినిమా విష‌యంలో అనుష్క‌పై చాలానే కామెంట్స్ వినిపించాయి. సినిమాలో ఆమెను స్లిమ్ గా చూపించ‌డానికి భారీగా గ్రాఫిక్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ను వాడార‌ని ఫ్యాన్స్ క‌మెంట్ చేశారు.

ప్ర‌మోష‌న్స్ కు రాని అనుష్క‌

ఆ వీఎఫ్ఎక్స్ ఆడియ‌న్స్ కు సినిమాపై చికాకుని కూడా తెప్పించ‌డంతో ఘాటీకి మంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో పాటూ కొంద‌రు ఫ్యాన్స్ అనుష్క‌ను ప్రెస్‌మీట్స్ కు, ప్ర‌మోష‌న్స్ కు రాక‌పోవడాన్ని కూడా త‌ప్పుబ‌డుతున్నారు. అనుష్క‌కు ఫ్లాపులున్న‌ప్ప‌టికీ, ఈ రోజుకీ అరుంధ‌తి, భాగ‌మ‌తిలోని ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ను ఆడియ‌న్స్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల్సిందే!

అయితే అనుష్క ఇంత‌కుముందులా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే మంచి క‌థ‌ల‌ను ఎంచుకుని వాటిపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. గ‌త కొంత‌కాలంగా ఆమె ఎక్కువ‌గా యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోనే చాలా లిమిటెడ్ గా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. స్క్రిప్ట్స్ విష‌యంలో అనుష్క మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకోవ‌డంతో పాటూ ప‌లు బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయాల‌ని, అప్పుడే మంచి సినిమాలొచ్చే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు.

దాంతో పాటూ ప్ర‌మోష‌న్స్ లో కూడా అనుష్క పాల్గొనాల‌ని, లేక‌పోతే ఆడియ‌న్స్, ఫ్యాన్స్ కు ఆమెతో క‌నెక్ష‌న్ త‌గ్గే ప్ర‌మాద‌ముంద‌ని భావిస్తున్నారు. థియేట‌ర్ల‌లో, ఓటీటీల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు మంచి డిమాండ్, క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో అనుష్క కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి సినిమాల‌ను లైన్ లో పెడితే తిరిగి ఫామ్ లోకి వ‌చ్చే వీలుంది. మ‌రి సినిమాల విష‌యంలో అనుష్క ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.