Begin typing your search above and press return to search.

# ఆర్సీ 17 లో హీరోయిన్ ప్లానింగ్ అదిరింది!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   6 Dec 2025 8:00 PM IST
# ఆర్సీ 17 లో హీరోయిన్ ప్లానింగ్ అదిరింది!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న`పెద్ది` షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో సుకుమార్ కూడా త‌న సినిమా ప‌నుల్ని స్పీడ‌ప్ చేసారు. పెండింగ్ పెట్టిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తిరిగి ప్రారంభించారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ సుకుమార్ దానిపై బెట‌ర్ మెంట్ కోసం సెట్స్ కు వెళ్లే వ‌ర‌కూ ప‌నిచేస్తూనే ఉంటారు. కాబ‌ట్టి సుకుమార్ సినిమాల విష‌యంలో? ఎప్పుడు ఏ సీన్ ఎలా మారుతుందో ముందే ఊహించ‌డం క‌ష్ట.

ఆరంభంలోనే ర‌ష్మిక పేరు:

ఆయ‌న సినిమా అంటే? గుమ్మ‌డి కాయ కొట్టే వ‌ర‌కూ రాయ‌డం అనే ప్రోస‌స్ నిరంత‌రం జ‌రుగుతూనే ఉంటుంది. సినిమాకు సంబంధించి టెక్నిక‌ల్ గా సుకుమార్ పాత టీమ్ పైనా ఆధ‌ర‌ప‌డ‌తారు. ఆ విష‌యంలో రిస్క్ తీసుకోవ డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. సంగీత ద‌ర్శ‌కుడిగా దేవి శ్రీ ప్ర‌సాద్..సినిమాటోగ్రాప‌ర్ గా రత్న‌వేలు లాంటి వారే ఉంటారు. మ‌రి హీరోయిన్ సంగ‌తేంటి? అంటే ఈ విష‌యంపై ఇంత వ‌ర‌కూ పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. అప్ప‌ట్లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నాను తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అంత‌ర్జాతీయంగా ఫేమ‌స్ అయిన న‌టి:

కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా అందుతోన్న స‌మాచారం ఏంటంటే? ఈ సినిమా కోసం ఏకంగా అంత‌ర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఫేమ‌స్ సెల‌బ్రిటీనే రంగంలోకి దించుతున్న‌ట్లు సుకుమార్ అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. ఆ న‌టి ఎవ‌రో కాదు..అందిర‌కీ బాగా తెలిసిన బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌. ఇప్పుడివ‌డ‌ను ఇలా అన‌డం కంటే కింగ్ కోహ్లీ స‌తీమ‌ణి అంటే అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అవును ఇది నిజ‌మే? చ‌ర‌ణ్ కు జోడీగా అనుష్క అయితే బాగుంటుంద‌ని సుకుమార్ భావిస్తున్నాడట‌.

లెక్క‌ల మాష్టారు కొత్త ఈక్వెష‌న్ దిశ‌గా:

ఈ చిత్రాన్ని సుకుమార్ తెలుగుతో పాటు, ఇంగ్లీష్ ల కూడా తీసి హాలీవుడ్ కి క‌నెక్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్రచారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ రేంజ్ న‌టి ఎవ‌రు? అంటే అనుష్క శ‌ర్మ‌గా తేలింది. అనుష్క‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంది. ఓ న‌టిగా కంటే విరాట్ కొహ్లీ స‌తీమ‌ణిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. విరాట్ ప్ర‌పంచంలో ఎక‌క్క‌డా ఏ మ్యాచ్ అడినా? అక్క‌డ అనుష్క ప్ర‌త్య‌క్ష‌మ‌ వుతుంది. మ్యాచ్ పూర్త‌య్యే వ‌ర‌కూ భ‌ర్త‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ప్రోత్స‌హిస్తుంది. విరాట్ సిక్సులు, ఫోర్లు బాదిన‌ప్పుడ‌ల్లా ప్లైయింగ్ కిస్సులిచ్చి హీట్ పెంచుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు? క్రీడాకారుల‌తో మాట మంతి చేస్తుంది. ఇలా క్రికెట‌ర్ల భార్యామ‌ణుల అంద‌రికంటే అనుష్క‌ ఎంతో ప్ర‌త్యేకంగా మారింది. అందుకే లెక్క‌లు మాష్టారు కూడా ఈసారి కొత్త ఈక్వెష‌న్ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.