Begin typing your search above and press return to search.

'వార‌ణాసి'లో లెజెండ‌రీ క్రికెట‌ర్ వైఫా?

ఇదంతా న‌టీన‌టుల‌కు సంబంధించి ఉన్న అధికారిక స‌మాచారం. అయితే తెర‌పైకి రాని పాత్ర‌లు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో కొన్ని కీల‌క‌మైన పాత్ర‌లు కూడా ఉన్నాయి.

By:  Srikanth Kontham   |   20 March 2026 5:00 AM IST
వార‌ణాసిలో లెజెండ‌రీ క్రికెట‌ర్ వైఫా?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య `వార‌ణాసి` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా, హీరోయిన్ గా ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడ‌ పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్ గా కుంభ పాత్ర పోషిస్తున్నాడు. విలోణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా న‌టీన‌టుల‌కు సంబంధించి ఉన్న అధికారిక స‌మాచారం. అయితే తెర‌పైకి రాని పాత్ర‌లు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో కొన్ని కీల‌క‌మైన పాత్ర‌లు కూడా ఉన్నాయి.

రాజ‌మౌళి సినిమా అంటే క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న చిన్న పాత్ర‌లు కూడా హైలైట్ అవుతుంటాయి. కీల‌క పాత్ర‌లైతే? వారి ద‌శే మారిపోయేలా పాత్ర‌లుంటాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి, లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పేరును రాజమౌళి పరిశీలిస్తున్నట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఇప్పటికే ఈ విషయంలో ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు స‌మాచారం.

`వారణాసి` ఒక గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం కావడంతో కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలకు అనుష్క శర్మ వంటి అనుభవం ఉన్న నటి అయితే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నారుట‌. అనుష్క శర్మ పాత్ర కథను మలుపు తిప్పే మిస్టీరియస్ క్యారెక్టర్ అని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే అనుష్క శర్మ అంగీక‌రిస్తే గ‌నుక ప్రోఫెష‌న‌ల్ గా ఆమె కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. విరాట్ ను వివాహ‌మాడిన త‌ర్వాత అనుష్క చాలా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌టిగా కంటే నిర్మాత‌గానే బిజీ అయ్యారు. `పీకే` లాంటి సినిమాతో పాన్ ఇండియాలోనూ ఆమెకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది.

గతంలో రాజ‌మౌళి `బాహుబలి` ని ప్ర‌శంసించిన వారిలో అనుష్క కూడా ఉంది. రాజమౌళి మేకింగ్‌ను ఎంతో లైక్ చేసింది. రాజమౌళి సినిమాల్లో అతిథి పాత్రలు కూడా సినిమా రేంజ్‌ను పెంచుతాయి. వారణాసి నేపథ్యంలో సాగే కొన్ని కీలక సన్నివేశాల్లో అనుష్క శర్మ కనిపించే అవకాశం ఉంది. అనుష్క శ‌ర్మ అంగీక‌రిస్తే? వారణాసికి గ్లోబ‌ల్ స్థాయిలో మార్కెట్ ప‌రంగానూ క‌లిసొస్తుంది. భ‌ర్త విరాట్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెటర్ గా ఎంతో మంచి పేరుంది. అలాంటి ప్లేయ‌ర్ స‌తీమ‌ణి `వార‌ణాసి`లో భాగ‌మైందంటే? 120 దేశాల్లో ఆ సినిమాకు ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీ ద‌క్కుతుంది. రాజ‌మౌళి ఛాయిస్ వెనుక ఈ స్ట్రాట‌జీ కూడా లేక‌పోయి ఉండ‌దు.