Begin typing your search above and press return to search.

కాంట్రవర్సీలో చిక్కుకున్న అనుష్క శర్మ.. స్పందిస్తుందా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

By:  Madhu Reddy   |   4 Jun 2026 12:56 PM IST
కాంట్రవర్సీలో చిక్కుకున్న అనుష్క శర్మ.. స్పందిస్తుందా?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అనుష్క.. సడన్‌గా ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ఆమె ఏం పోస్ట్ చేసింది? నెటిజన్లు ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం..

వివాదానికి కారణమైన ఇన్‌స్టా వీడియో:

అసలు మ్యాటర్ ఏంటంటే.. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హోమియోపతి ఫిజీషియన్ రాజన్ శంకరన్ మాట్లాడిన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో హోమియోపతి వైద్యం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని, దానివల్ల తనకు ఎంతో మేలు జరిగిందని రాసుకొచ్చారు. అయితే ఒక సెలబ్రిటీ అయి ఉండి హోమియోపతిని ప్రమోట్ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అశాస్త్రీయమంటూ మండిపడుతున్న నెటిజన్లు:

అనుష్క చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు, కొంతమంది వైద్య నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హోమియోపతి అనేది పూర్తిగా అశాస్త్రీయమైనదని, దానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని వాదిస్తున్నారు. ఇక ఇలాంటి నకిలీ వైద్య పద్ధతులను, దొంగ బాబాలను పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రజలు తప్పుదోవ పడతారని అనుష్కపై సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు.

అనుష్కకు మద్దతుగా మరో వర్గం:

ఇదిలా ఉంటే, అనుష్క శర్మకు సపోర్ట్ చేస్తూ మరికొందరు రంగంలోకి దిగారు. అల్లోపతి మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, కానీ హోమియోపతిలో అలాంటి భయాలు ఉండవని వారు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతే ఎంతో మేలైన చికిత్స అని, అల్లోపతి కంటే ఇదే బెటర్ అని వాదిస్తున్నారు. ఇక అనుష్క కేవలం తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను మాత్రమే షేర్ చేసిందని, ఇందులో తప్పుపట్టడానికి ఏముందని ఆమె మద్దతుదారులు సమర్థిస్తున్నారు.

ఇక ఏదేమైనా, అనుష్క శర్మ పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు అల్లోపతి వర్సెస్ హోమియోపతి అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీలు ఏది మాట్లాడినా, ఏది పోస్ట్ చేసినా అది ప్రజలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టే ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి ఈ కొత్త వివాదంపై ఆమె ఎలా స్పందించి క్లారిటీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.