ఏడేళ్ల తర్వాత చక్ దే ఎక్స్ ప్రెస్ రిలీజ్ ప్లాన్.. వరల్డ్ ఛాంపియన్స్ వల్లే..!
మహిళా క్రికెట్ తో దేశానికి ప్రపంచ కప్ తెచ్చి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. మెన్ క్రికెట్ ని మాత్రమే ఆదరించే మన దగ్గర ఉమెన్ క్రికెట్ కి క్రేజ్ వచ్చేలా చేశారు మన టీం ఇండియా ప్లేయర్స్.
By: Ramesh Boddu | 8 Nov 2025 12:22 PM ISTమహిళా క్రికెట్ తో దేశానికి ప్రపంచ కప్ తెచ్చి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. మెన్ క్రికెట్ ని మాత్రమే ఆదరించే మన దగ్గర ఉమెన్ క్రికెట్ కి క్రేజ్ వచ్చేలా చేశారు మన టీం ఇండియా ప్లేయర్స్. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఉమెన్ వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేసుకుని ప్రపంచ దేశాలను షాక్ అయ్యేలా చేశారు. ఐతే వీరి స్పూర్తితో మహిళా క్రికెట్ నేపథ్యంతో తీసిన సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఐతే ఈ క్రమంలోనే ఎప్పుడో ఏడేళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన చక్ దే ఎక్స్ ప్రెస్ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఝులాన్ గోస్వామి జీవిత కథతో చక్ దే ఎక్స్ ప్రెస్..
భారతీయ మహిళా క్రికెటర్ ఝులాన్ గోస్వామి జీవిత కథతో ప్రొసిత్ రాయ్ డైరెక్షన్ లో చక్ దే ఎక్స్ ప్రెస్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను కర్నేష్ శర్మ నిర్మించారు. ఐతే సినిమా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో సినిమా మేకర్స్ మధ్య గొడవల వల్ల సినిమా రిలీజ్ ఆపేశారు. ఐతే మళ్లీ ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్.
ఎలాగు ఉమెన్ వరల్డ్ కప్ లో టీం ఇండియా విక్టరీ సాధించింది కాబట్టి ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. అంతేకాదు టీం ఇండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత కొందరు సినీ ప్రియులు చక్ దే ఎక్స్ ప్రెస్ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో డిస్కషన్ చేశారు. ఫైనల్ గా చక్ దే ఎక్స్ ప్రెస్ పై జరుగుతున్న ఈ చర్చ సినిమా రిలీజ్ జరిగేలా ఉంది.
క్రీడలను తమ కెరీర్ గా ఎంచుకున్న మహిళలకు..
చక్ దే ఎక్స్ ప్రెస్ సినిమాలో అనుష్క శర్మ లీడ్ రోల్ లో నటించింది. తప్పకుండా ఈ సినిమా ఈ టైం లో రిలీజ్ చేస్తే మహిళా క్రికెటర్స్ కు మరింత స్పూర్తి కలిగిస్తుంది. అంతేకాదు క్రీడలను తమ కెరీర్ గా ఎంచుకున్న మహిళలకు ఈ సినిమా కూడా ఒక ఇన్ స్ప్రేషన్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. విరాట్ కొహ్లి సతీమణి అనుష్క శర్మ నటించడం వల్ల చెక్ దే ఎక్స్ ప్రెస్ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా రిలీజ్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
వెండితెర మీద క్రీడా నేపథ్యంతో వచ్చిన సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఐతే వీటిలో ప్రత్యేకంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటే ఆడియన్స్ లో ఆసక్తి మరింత పెరుగుతుంది. అందుకే చక్ దే ఎక్స్ ప్రెస్ రిలీజ్ అనగానే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది.
