తల్లిదండ్రులుగా మరో జోడీకి ప్రమోషన్ !
బాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన అనుష్క రంజన్ -ఆదిత్య సీల్ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.
By: Srikanth Kontham | 30 May 2026 4:00 PM ISTబాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన అనుష్క రంజన్ -ఆదిత్య సీల్ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఐదేళ్ల విజయవంతమైన వివాహా బంధం ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న జంట త్వరలోనే మొదటి సంతానాన్ని స్వాగతించబోతున్నారు. పెళ్లయిన తర్వాత ఒకరికొకరు అండగా ఉంటూ కెరీర్ పరంగా .. వ్యక్తిగత జీవితంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా తల్లిదండ్రులుగా మారుతోన్న తరుణంలో ఈ శుభవార్తతో వారి కుటుంబంలో సన్నిహితుల మధ్య పండగ వాతావరణం నెలకొంది.
విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకరి జీవితంలో ఇదొక అత్యంత విలువైన .. భావోద్వేగాలతో కూడిన సమయమని ఈ కొత్త ప్రయాణం వారికి మరిన్ని ఆనందాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, మౌని రాయ్ వంటి ప్రముఖ నటీమణులు కాబోయే తల్లిదండ్రులపై తమ ప్రేమను, శుభాకాంక్షలను కురిపించారు. పరిశ్రమలో ఉండే గ్లామర్, పోటీ ప్రపంచాన్ని పక్కన పెడితే తోటి కళాకారుల జీవితంలోని సంతోషకరమైన సమయాల్లో ఇలాంటి ఆప్యాయతలు, మద్దతు చూపించడం ఇండస్ట్రీలోని బలమైన స్నేహ బంధాలకు అద్దం పడుతోంది.
స్నేహితుల నుండి వస్తోన్న ఈ ఆశీస్సులు ఆ జంటకు మరింత మానసిక ఆనందాన్ని అందిస్తున్నాయి . ఆధునిక కాలంలో సెలబ్రిటీలు తమ కెరీర్ మైలురాళ్లతో పాటు కుటుంబ విస్తరణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాల పాటు తమ వృత్తిగత బాధ్యతలపై దృష్టి పెట్టి, ఆ తర్వాత సరైన సమయంలో పేరెంట్‌హుడ్‌ను స్వీకరించడం అనేది నేటి తరం ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోంది. అనుష్క, ఆదిత్యల నిర్ణయం కూడా వారి పరిణతిని ..జీవిత ప్రణాళికల పట్ల ఉన్న స్పష్టతను తెలియజేస్తోంది.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ పితృత్వం -మాతృత్వం అనేది కొత్త బాధ్యతను, సరికొత్త దృక్పథాన్ని నేర్పుతుంది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే కుటుంబ విలువలకు పెద్దపీట వేసే ఈ జంట, రాబోయే రోజుల్లో తమ బిడ్డతో కలిసి సరికొత్త జ్ఞాపకాలను సొంతం చేసుకోబోతున్నారు. అనుష్క రంజన్, ఆదిత్య సీల్ ల ఈ నూతన ప్రయాణం విజయవంతంగా, ఆనందంగా సాగాలని ఆశిద్దాం. ఇప్పటికే తల్లిదండ్రులుగా మారిన బాలీవుడ్ జోడీలు ఎన్నో ఉన్నాయి. వారంతా కెరీర్ ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తల్లులు గా మారినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అమ్మ అయితేనే అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఈ మధ్య కాలంలో ప్రూవ్ అయింది. కియారా అద్వాణీ, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ లాంటి వారు పెళ్లి తర్వాత ఎంత బిజీ అయ్యారో? తెలిసిందే. వారితో పాటు వారి భర్తలు కూడా కొత్త అవకాశాలతో మరింత యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు
