ఎట్టకేలకు చిరు కోసం అనుష్క!
మెగాస్టార్ చిరంజీవి సరసన అనుష్క ను చూసే సమయం ఆసన్నమైందా? అనుష్క కోరిక సైతం నెరవేరబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది.
By: Srikanth Kontham | 29 Sept 2025 5:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి సరసన అనుష్క ను చూసే సమయం ఆసన్నమైందా? అనుష్క కోరిక సైతం నెరవేరబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా 158వ చిత్రం బాబి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. అయితే ఇందులో హీరోయిన్ గా అనుష్కను తీసుకోవాలని భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో బాబి..అనుష్కకు టచ్ లోకి వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
కోరిక నెరవేరబోతుందా:
ఆమె కూడా పాజిటివ్ గానే స్పందించిందని సమాచారం. చిరంజీవితో తెరను పంచుకోవాలని అనుష్క చాలా కాలంగా ఎదురు చూస్తోంది. సీనియర్ హీరోలు వెంకటేష్ , నాగార్జునలతో కలిసి నటించినా? చిరు..బాలయ్యలు మాత్రం ఇంకా ఆమె ఖాతాలో చేరలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని ఓ సందర్భంలో మీడియా ముఖంగా ఓపెన్ అయింది. తమ కాంబినేషన్ లో ఎవరైనా సినిమా చేస్తే బాగుండని అభిప్రాయ పడింది. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. చిరంజీవి వేర్వేరు హీరోయిన్లతో పని చేసారు గానీ..అనుష్క కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.
అందుకోసమే స్కిప్ కొట్టిందా:
ఈ నేపథ్యంలో బాబి చొరవ తీసుకోవడంతో? చిరు-స్వీటీ కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి అనుష్క అన్ని రకాలు గా మ్యాచ్ అవుతుంది. పర్పెక్ట్ జోడీగా తెరపై హైలైట్ అవుతుంది. అనుష్క వయసు కూడా 43 ఏళ్లు..చిరంజీవి కి 70 ఏళ్లు. తెరపై అందంగా కనిపించే జోడీ అవుతుంది. అయితే అనుష్క రూప లావణ్యంలో భారీ మార్పులు తీసుకు రావాలి. అప్పుడే తెరమరింత నిండుగా కనిపిస్తుంది. అనుష్క గత సినిమా `ఘాటీ` ప్రచారంలో పాల్గొనని సంగతి తెలిసిందే. లుక్ పరంగా తీసుకొస్తున్న మార్పులు నేపథ్యంలోనే స్కిప్ట్ కొట్టిందనే ప్రచారం జరిగింది.
పవన్ కోసం అంతే ఆసక్తిగా:
ఈ నేపథ్యంలో చిరు సినిమా కోసమే ఇలా సన్నధం అవుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. అదే నిజమైతే మెగా అభిమానులకు ఇది మంచి గుడ్ న్యూస్ అవుతుంది. ఆ కాంబోని చూడాలని వాళ్లు అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. చిరుతోనే కాదు అనుష్క పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్టార్లు అందరితోనూ కలిసి పనిచేసాను కానీ పవన్ తో మాత్రం నటించే ఛాన్స్ రాలేదని ఓ సందర్భంలో ఓపెన్ అయింది. ఆ కోరిక కూడా నెర వేరడానికి ఎంతో సమయం లేదు.
