'ఘాటీ' కథ..అనుష్క పాత్ర ఇలా!
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన `ఘాటీ`కి రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో రెండు రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Srikanth Kontham | 3 Sept 2025 1:51 PM ISTఅనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన `ఘాటీ`కి రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో రెండు రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు అన్నది అధికారికం. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో సాగే కథగా క్లారిటీ వచ్చేసింది. అయితే అందులో అసలు కథ ఏంటి? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. రిలీజ్ వరకూ కూడా స్టోరీ కి సంబంధించి ఏదీ బయటకు రాదు. అతికొద్ది మంది దర్శకులు మాత్రమే స్టోరీ గురించి ముందే రివీల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో `ఘాటీ` అసలు కథేంటి అన్న దానిపై ప్రేక్షకుల్లో సస్పెన్స్ మొదలైంది.
ఘాటీలంటే కూలీలు:
ఈ నేపథ్యంలో క్రిష్ రిలీజ్ కు ముందే ఆ సస్పెన్స్ కు తెర దించేసారు. ఆయనే స్వయంగా కథని రివీల్ చేసారు. ఇది ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సాగే కథ ఇది. అక్కడ ఓ కొండ నీడలో ఉండే మరో కొండపై శీలావతి రకం గంజాయి పెరుగుతుంది. దాన్ని మోసే కూలీలలనే ఘాటీ అంటారు. అదంతా ఓ ప్రపంచం. వాళ్ల సంస్కృతి, జీవిన విధానం గురించి తెలుసుకున్న తర్వాత ఈ కథని సినిమాగా తీస్తే బాగుంటుం దనిపించింది. గుర్తింపు మనుగడ అనే థీమ్ చుట్టూ సాగే కథగా పేర్కొన్నారు.
ఆయన చెప్పిన ఆలోచన నుంచే:
కథలో బలమైన భావోద్వేగాలుంటాయన్నారు. చాలా క్లిష్టమైన కథని చాలా , సినిమాటిక్ పద్దతిలోనే చెప్పే ప్రయత్నం చేసానన్నారు. 18 ఏళ్ల దర్శకుడిగా తన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కథా ఆలోచన చెప్పింది చింతకింది శ్రీనివాసరావు. ఆయన చెప్పగానే ఎంతో సహజంగా అనిపించిందన్నారు. అందులో లీలావతి పాత్రకు అనుష్క గ్రేస్, నడవడిక, ఇమేజ్ సరిపోతాయని ఎంపిక చేసామన్నారు.
క్రిష్ కథలు ఎడ్యుకేట్ చేస్తుంటాయి:
క్రిష్ కమర్శియల్ చిత్రాల దర్శకుడు కాదు. ఆయనకంటూ ఓ స్టైల్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆయన ప్రస్తానం అలాగే కొనసాగుతుంది. `గమ్యం`, `వేదం`, `కృష్ణం వందే జగద్గురం `, `కంచె`, `కొండ పొలం` ఇలా ఏ సినిమా తీసుకున్నా? ఆ కథలన్ని వాస్తవ జీవితాల నుంచి పుట్టినవే. ఆయన కథా వస్తువుకు ఆధా రం వాస్తవ జీవితాలే. ఆ కథల కోసం క్రిష్ ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అంతే రియలిస్టిక్ గా ఉండేలా చూసుకుంటారు. కమర్శియల్ గా క్రిష్ సినిమాలు వందల కోట్లు వసూళ్లు తీసుకు రాకపోవచ్చు. గొప్ప ఎంటర్ టైనర్లు కాకపోవచ్చు. కానీ మురగదాస్ చెప్పినట్లు క్రిష్ సినిమాలు ఎడ్యుకేట్ చేస్తుంటాయన్నది వాస్తవం.
